ASBL Koncept Ambience
facebook whatsapp X

విశ్వంభ‌ర గ్రాఫిక్స్ లో త‌గ్గేదేలే!

విశ్వంభ‌ర గ్రాఫిక్స్ లో త‌గ్గేదేలే!

ఈ మ‌ధ్య వీఎఫ్ఎక్స్, సీజీఐ ప్రాముఖ్య‌త అన్ని సినిమాల్లోనూ పెరిగింది. క‌ల్కి సినిమాను రూ.600 కోట్ల‌తో నిర్మిస్తే అందులో రూ.230 కోట్లు కేవ‌లం వీఎఫ్ఎక్స్ కోస‌మే ఖ‌ర్చు పెట్టారు. క‌ల్కి2 కోసం ఆ ఖ‌ర్చు ఇంకా పెర‌గ‌నుంది. సౌత్ లో తెర‌కెక్కిన బాహుబ‌లి, బాహుబ‌లి2, రోబో2.0 లాంటి సినిమాల‌కు కూడా భారీ వీఎఫ్ఎక్స్ ను వాడారు.

గ‌తంలో చిరంజీవి అంజి సినిమాకు కూడా సీజీఐ వ‌ర్క్ చేశారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరూ న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ సినిమా విశ్వంభ‌ర కోసం సీజీఐ, వీఎఫ్ఎక్స్ కు భారీగా బ‌డ్జెట్ ను కేటాయించార‌ని తెలుస్తోంది. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సెకండాఫ్ పూర్తిగా సీజీఐ మీదే రూపొందుతుంద‌ని టాక్.

దానికోసం వ‌ర‌ల్డ్ క్లాస్ సీజీఐ వ‌ర్క్ అవ‌స‌రమ‌య్యే ప్ర‌త్యేక షాట్స్ ఉన్నాయ‌ట‌. వీటి కోసం ఏకంగా రూ.12 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని స‌మాచారం. చిరంజీవికి సోషియో ఫాంట‌సీ క‌థ‌ను చెప్పి ఓకే చేయించుకోవ‌డ‌మే గొప్ప విష‌య‌మైతే అలాంటిది ఇప్పుడు భారీ బ‌డ్జెట్ తో సినిమాను నిర్మించ‌డంతో పాటూ వీఎఫ్ఎక్స్ కు భారీగా ఖ‌ర్చు పెట్టించ‌డం ఒక్క వ‌శిష్ట‌కే చెల్లింది. పెట్టిన ఖ‌ర్చుకు త‌గ్గ‌ట్టు అవుట్ పుట్ వ‌చ్చేలా వ‌శిష్ట విశ్వంభ‌ర కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు అంద‌రూ చెప్తున్నారు. త్రిష హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :