ASBL Koncept Ambience
facebook whatsapp X

కంగువ హ‌క్కుల‌కు భారీ డిమాండ్

కంగువ హ‌క్కుల‌కు భారీ డిమాండ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టిస్తున్న తాజా సినిమా కంగువ‌. భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్రెడీ మొద‌లయ్యాయి. ఈ సినిమాకు త‌మిళంతో పాటూ తెలుగులో కూడా డిమాండ్ పెర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. యువి క్రియేష‌న్స్ నిర్మాణ భాగ‌స్వామి కావ‌డంతో ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి రిలీజ్ ద‌క్కే అవ‌కాశ‌ముంది.

నైజాంలో ఈ సినిమా రేటు రూ.20 కోట్ల వ‌ర‌కు ప‌లుకుతుంద‌నే వార్త ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కంగువకు ఈ రేంజ్ హైప్ రావ‌డానికి ఎన్నో కార‌ణాలున్నాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను గ‌తం, వ‌ర్త‌మానం రెండు బ్యాక్ డ్రాప్స్ తీసుకుని డైరెక్ట‌ర్ శివ చాలా కొత్త ప్ర‌యోగం చేశాడని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

సినిమాలో సూర్య రెండు గెట‌ప్స్ లో క‌నిపించ‌నుండ‌టం, విల‌న్ గా బాబీ డియోల్, హీరోయిన్ గా దిశా పటానీ న‌టిస్తుండ‌టం హైప్ ను పెంచుతున్నాయి. పుష్ప త‌ర్వాత దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న సినిమా కావ‌డంతో క్రేజ్ ను ఎక్క‌డికో తీసుకెళ్తున్నాయి. కోలీవుడ్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమా ఇవ్వ‌ని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ను కంగువ ఇస్తుంద‌ని త‌మిళ మీడియా వ‌ర్గాలు ఊరిస్తున్నాయి. మ‌రి అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానున్న కంగువ సూర్య‌కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :