ASBL NSL Infratech

రాజా సాబ్ కు పెరిగిన డిమాండ్

రాజా సాబ్ కు పెరిగిన డిమాండ్

సినిమా ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ప్ర‌భాస్ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన సాహో నిరాశ‌ప‌రిచినా నార్త్ లో బాగానే వ‌ర్క‌వుట్ అయింది. రాధేశ్యామ్ కు డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చినా భారీ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఇక ఆదిపురుష్ అయితే భారీగా ట్రోల్ అయింది. కానీ క‌లెక్ష‌న్స్ మాత్రం రూ.400 కోట్లు దాటింది.

మిక్డ్స్ టాక్ తో స‌లార్ సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు క‌ల్కి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డంతో రికార్డుల‌ను తిర‌గ‌రాసేలా ఉంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డుల‌నే కొల్ల‌గొట్టేలా ఉంది. షేర్ ఇంకా ఆర్ఆర్ఆర్ ను దాట‌లేదు కానీ సాధ్య‌మ‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. దీనికంతటికీ కార‌ణం ప్ర‌భాస్ క్రేజే. అలాంటి ప్ర‌భాస్ నుంచి నెక్ట్స్ రాబోయే సినిమా రాజా సాబ్.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. రాజా సాబ్ లో ఒక‌ప్పటి వింటేజ్ ప్ర‌భాస్ ను చూస్తార‌ని మారుతి ప్ర‌తిసారీ ఊరిస్తున్నాడు. దీంతో మామూలుగానే రాజా సాబ్ మీద అంచ‌నాలేర్పడ్డాయి. ఇప్పుడు క‌ల్కి రిజ‌ల్ట్ చూశాక రాజా సాబ్ కు ఉన్న డిమాండ్ ఎక్కువైంది. ఇది జ‌రుగుతుంద‌ని ముందే అనుకున్న‌ప్ప‌టికీ క‌ల్కి త‌ర్వాత రాజా సాబ్ రైట్స్ రైట్స్ కు ఈ రేంజ్ లో డిమాండ్ ఉంటుంద‌నేది మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. చూస్తుంటే రాజా సాబ్ కు కూడా క‌ల్కి స్థాయిలో బిజినెస్ జ‌రిగేలా ఉంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :