ASBL Koncept Ambience
facebook whatsapp X

గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో వారిపై ఒత్తిడి

గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో వారిపై ఒత్తిడి

గేమ్ ఛేంజ‌ర్(Game Changer) ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ అయిన నేప‌థ్యంలో మెగా ఫ్యాన్స్ అంద‌రూ ప‌బ్లిసిటీ ప‌రంగా దిల్ రాజు(Dil Raju) టీమ్ మీద భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. ఇండియ‌న్2(Indian2) డిజాస్ట‌ర్ త‌ర్వాత శంక‌ర్ మీద బాగా నెట్టింట ట్రోల్స్ బాగా జ‌రిగాయి. గేమ్ ఛేంజ‌ర్(Game Changer) మ్యూజిక్ విష‌యంలో గుంటూరు కారం(Guntur kaaram) త‌ర్వాత క‌నిపించ‌కుండా పోయిన త‌మ‌న్(Thaman) మీద కూడా ఎంతో ఒత్తిడి ఉంది.

దేవ‌ర(Devara) బీజీఎం విష‌యంలో అనిరుధ్(Anirudh) నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించిన దాన్ని అత‌ను నెర‌వేర్చుకున్నాడు. ఇప్పుడు త‌మ‌న్ దాన్ని మించి గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో ప్రూవ్ చేసుకోవాల‌ని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే మొద‌టి సాంగ్ గా వ‌చ్చిన జ‌ర‌గండి(Jaragandi) విష‌యంలో త‌మ‌న్ మెగా ఫ్యాన్స్(Mega Fans) ను బాగా నిరాశ ప‌రిచాడు.

ఇప్పుడు రా మ‌చ్చా(Ra Macha) సాంగ్ పై హైప్ నెక్ట్స్ లెవెల్ లో ఉంది. ప్రోమో వ‌చ్చింది కానీ దాన్ని బ‌ట్టి నిర్దార‌ణ‌కు రాలేం. పూర్తి పాట వ‌చ్చాకే ఓ క్లారిటీ వ‌స్తుంది. ఇక శంక‌ర్ కూడా గేమ్ ఛేంజ‌ర్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుక‌ని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటూ ప్ర‌మోష‌న్స్ లోనూ ఎక్కువ ఇన్వాల్వ్ కావాల‌ని డిసైడ‌య్యాడ‌ట‌. ఆచార్య(Acharya) చేసిన గాయం నుంచి కొర‌టాల ఎలాగైతే దేవ‌ర రూపంలో బ‌య‌ట‌ప‌డ్డాడో ఇప్పుడు క‌మ‌ల్(kamal) ఇచ్చిన షాక్ నుంచి శంక‌ర్ ను కూడా కోలుకునేలా చేయాల్సింది రామ్ చ‌ర‌ణే(Ram Charan). ఈ సినిమాకు ఇప్ప‌టినుంచైనా ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేసి సినిమా ఆడియ‌న్స్ లోకి వెళ్లేలా చేయాల‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :