ASBL Koncept Ambience
facebook whatsapp X

తప్పుడు డాక్యుమెంట్లతో చెరువులో కట్టడాలు : హైడ్రా కమిషనర్ ఆగ్రహం

తప్పుడు డాక్యుమెంట్లతో చెరువులో కట్టడాలు : హైడ్రా కమిషనర్ ఆగ్రహం

ఈదులకుంటను అధికారులు సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును బుధవారం నాడు ఆయన పరిశీలించారు. ఖానామెట్ గ్రామంలో 6.5 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు శిఖాన్ని పూడ్చేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారని, చెరువులోకి నీరు వచ్చే నాలాను బిల్డర్లు దారి మళ్లించారని ఆయన గుర్తించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. అక్రమంగా తీసుకున్న అనుమతులతోనే ఈ నిర్మాణాలు చేపట్టారని, కాబట్టి ఇక్కడ సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :