ASBL Koncept Ambience
facebook whatsapp X

దుబాయ్‌లో ఘనంగా ఐఫా 2024 అవార్డుల వేడుక

దుబాయ్‌లో ఘనంగా ఐఫా 2024 అవార్డుల వేడుక

దుబాయ్‌ వేదికగా సాగిన ఐఫా 2024 అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేదికపై తారాతోరణం గ్లామ్‌ అండ్‌ గ్లిప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రఖ్యాత ఫిల్మ్‌ అవార్డ్‌ వేడుక ఐఫా ఉత్సవం 2024 కోసం దుబాయిలోని ఎతిహాద్‌ అరేనా సందడిగా మారింది. టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఇదే వేదిక వద్ద మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ తన కుమార్తె ఆరాధ్య తో కలిసి కనిపించారు. ఏఆర్‌ రెహమాన్‌, విక్రమ్‌, మణిరత్నం, నాని, సుహాసిని, రాశి ఖన్నా, రకుల్‌ ప్రీత్‌, సమంత, కృతి సనన్‌ తదితరులు ఈ అవార్డు వేడుకలో పాల్గొన్నారు. సంవత్సరంలో అతిపెద్ద ఈవెంట్‌ ఉత్సాహం నింపింది. అబుదాబిలో శుక్రవారం (సెప్టెంబర్‌ 27) నాడు ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌  24వ ఎడిషన్‌ కోసం సౌత్‌ - బాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలకు చెందిన అందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం గ్లామర్‌ ని తీసుకువచ్చింది. ఐఐఎఫ్‌ఎ ఉత్సవం 2024 వేదికపై విజేతలకు పురస్కారాలు అందించారు. సమంతా రూత్‌ ప్రభు ఈ వేదికపై ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024 పురస్కారాన్ని గెలుచుకుంది.

నేచురల్‌ స్టార్‌ నాని ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అరుదైన ఘనతను సాధించారు, ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘దసరా’లో తన అద్భుతమైన నటనకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు (తెలుగు), సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ అందుకున్న నాని ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డు, ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డు ని అందుకున్నారు. ఐఫాలో దసరా సినిమాకిగానూ ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సుధాకర్‌ చెరుకూరి అందుకున్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ‘దసరా’ అద్భుతమైన కథాంశం, పెర్ఫార్మెన్స్‌ లతో ప్రశంసలు అందుకుంది. ధరణి పాత్రలో నాని ఎక్స్‌ ట్రార్డినరీ పెర్ఫామెన్స్‌ తో విమర్శలు, ప్రేక్షకులని ప్రసంశలని పొందారు. అవార్డ్‌ అందుకున్న సందర్భంగా నాని మాట్లాడుతూ..’’దసరాకు లభించిన ప్రేమ, గౌరవం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఈ అవార్డులు మొత్తం నటీనటులు, టీం కృషి, అంకితభావానికి నిదర్శనం. అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘భగవంత్‌ కేసరి’ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది.  డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఐఐఎఫ్‌లో భగవంత్‌ కేసరి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఎంటర్‌ టైన్మెన్‌, యాక్షన్‌ సినిమాలు చేసే అనిల్‌ రావిపూడి ‘భగవంత్‌ కేసరి’లో అందరినీ సర్‌ ప్రైజ్‌ చేస్తూ గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌ కాన్సెప్ట్‌ తో బిగ్‌ హిట్‌ కొట్టారు. గొప్ప కథాంశంతో విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు అందుకొని ఇప్పుడు ఐఐఎఫ్‌ఎలో ఉత్తమ దర్శకుడు అవార్డ్‌ ని అందుకున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన భగవంత్‌ కేసరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోని యూనిక్‌ ఎలిమెంట్స్‌ తో సీరియస్‌ సబ్జెక్ట్‌ను బ్లెండ్‌  చేయడం డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఎబులిటీకి నిదర్శనంగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఐఫా (%IIఖీA%-2024) అవార్డుల ఉత్సవం అబుదాబి వేదికగా ఘనంగా జరిగింది. హీరో తేజ సజ్జా, రానా  హోస్ట్‌ చేసిన ఈ వేడుక కన్నుల పండగగా సాగింది. ఈ వేడుకలో తేజ సజ్జా ఎనర్జిటిక్‌ హోస్టింగ్‌ సెంటర్‌ అఫ్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచింది.   

ఐఫా 2024 విజేతల పూర్తి జాబితా:
ఉత్తమ చిత్రం (తమిళం): జైలర్‌
ఉత్తమ నటుడు (తెలుగు): నాని (దసరా)
ఉత్తమ నటుడు (తమిళం):విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌:2)
ఉత్తమ నటి (తమిళం): ఐశ్వర్య రాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌: 2)
ఉత్తమ దర్శకుడు (తమిళం): మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌: II)
ఉత్తమ సంగీత దర్శకత్వం (తమిళం): ఎ.ఆర్‌ రెహమాన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌: II)
భారతీయ సినిమాలో అత్యద్భుతమైన విజయం: చిరంజీవి
భారతీయ సినిమాకు అత్యుత్తమ సహకారం: ప్రియదర్శన్‌
ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా: సమంత రూత్‌ ప్రభు
ప్రతినాయకుడి పాత్రలో ఉత్తమ ప్రదర్శన (తమిళం): ఎస్‌ జె సూర్య (మార్క్‌ ఆంటోని)
ప్రతినాయకుడి పాత్రలో ఉత్తమ ప్రదర్శన (తెలుగు): షైన్‌ టామ్‌ చాకో (దసరా)
ప్రతినాయకుడి పాత్రలో ఉత్తమ ప్రదర్శన (మలయాళం): అర్జున్‌ రాధాకృష్ణన్‌ (కన్నూర్‌ స్క్వాడ్‌)
సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన (పురుషుడు - తమిళం): జయరామ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌: II)
సహాయక పాత్రలో ఉత్తమ ప్రదర్శన (మహిళ - తమిళం): సహస్ర శ్రీ (చిత్త)
గోల్డెన్‌ లెగసీ అవార్డు: నందమూరి బాలకృష్ణ
కన్నడ సినిమాలో అత్యుత్తమ ప్రతిభ: రిషబ్‌ శెట్టి
బెస్ట్‌ డెబ్యూ (మహిళ - కన్నడ): ఆరాధనా రామ్‌ (కాటెరా)

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :