ట్రంప్ సర్కారు సుంకాలు విధిస్తే ...అది రెండు దేశాల మధ్య
భారత్ ఎగుమతులపై ట్రంప్ సర్కారు సుంకాలు విధిస్తే అది రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీయెచ్చని అమెరికా ప్రతినిధుల సభకు ఇటీవల ఎన్నికైన సుహాస్ సుబ్రహ్మణం అభిప్రాయపడ్డారు. తాను మాత్రం అదనపు సుంకాలను వ్యతిరేకిస్తానని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడగానే భారత్ ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుహాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై టారీఫ్‌లు విధించడాన్ని నేను వ్యతిరేకిస్తా. అది నిజంగా రెండు దేశాలకు హాని కలిగిస్తుందని నమ్ముతాను. వాణిజ్య యుద్ధానికి దారి తీయొచ్చు. భారత్‌లో చాలా కంపెనీలు బాగా పని చేస్తున్నాయి. వాటిల్లో చాలా అమెరికాలో కూడా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఆర్థికంగా ఇరుదేశాలు కలిసి మరింత పని చేయాలి. అప్పుడే బలపడతాం. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ నేపథ్యంలో అమెరికా`భారత్ సంబంధాలు బలపడటం ఇరుపక్షాలకు చాలా కీలకం అని వ్యాఖ్యానించారు.