ఆ విషయంలో కూటమిని ఫాలో అవుతున్న జగన్.. సూపర్ అంటున్న అభిమానులు..
ప్రస్తుతం ఆంధ్రలో సోషల్ మీడియా విషయంలో ఎటువంటి హల్చల్ జరుగుతుందో అందరికీ తెలుసు. గతంలో తమ ప్రభుత్వంపై, నేతలపై అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టారు అంటూ ఎందరికో నోటీసులు పంపడంతో పాటు వీలైన వారిని అరెస్టు కూడా చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన జగన్.. సోషల్ మీడియా వేధింపులపై కూటమి బాటే పట్టారు.
జగన్ ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ కి కూటమి కుదేలయ్యేలా కనిపిస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే రాజకీయ జీవితం మొదలుపెట్టిన నాటి నుంచి జగన్ మీడియా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన పై మొదటినుంచి దుష్ప్రచారం సాగుతూనే ఉంది. పాదయాత్ర సమయం నుంచి ముఖ్యమంత్రి అయినంతవరకు.. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత కూడా జగన్ ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అయితే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న జగన్ వైలెంట్ గా రియాక్ట్ అవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఫస్ట్ టైం అయినా అదానీ నుంచి 1750 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నట్టు వచ్చిన వార్తలపై విరుచుకుపడ్డారు. ఎటువంటి ఆధారం లేకుండా తనపై మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. వారిపై 100 కోట్లకు పరుగునష్టం దావా వేస్తాను అని జగన్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సైలెంట్ గా ఉన్న జగన్ ఎప్పుడూ ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా మౌనానికి స్వస్తి చెప్పకపోతే కష్టమని భావించారో.. లేక కూటమి ప్రభుత్వం బాటలోనే పోయి వారికి సరియైన రిప్లై ఇవ్వాలనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి జగన్ ఇలా విరుచుకు పడడం అతని అభిమానులకు కాస్త ఎనర్జీ అందించింది. అంతేకాదు జగన్ హయాంలో కేవలం పఫ్స్ కోసం భారీ ఎత్తు ఖర్చు చేశారు అని ప్రచారం సాగుతుంది. అయితే గతంలో చిన్న బాబు చిరుతీళ్లకు పాతిక కోట్లు అని జగన్ పత్రికలో వార్త వచ్చినందుకు లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఇక ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడిచి వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.