ASBL NSL Infratech
facebook whatsapp X

కూచిపూడి సంజీవని వైద్యాలయం నందు ధన్వంతరి వార్డ్ ప్రారంభోత్సవం....

కూచిపూడి సంజీవని వైద్యాలయం నందు ధన్వంతరి వార్డ్ ప్రారంభోత్సవం....

ఈరోజు ది.03-08-2024 శనివారం నాడు రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం నందు జరిగిన ధన్వంతరి వార్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ.సత్యకుమార్ యాదవ్ గారు ధన్వంతరి వార్డ్ ప్రారంభించడం జరిగింది, అనంతరం జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో స్వార్ధానికి విద్య వైద్యం వ్యాపారంగా మార్చేసిన ఇలాంటి  రోజుల్లో ఈ గ్రామీణ ప్రాంతంలో సేవ చేయాలి అనే ఉదేశ్యంతో ఒక  వైద్యాలయం ఏర్పాటు చేయడం దాని ద్వారా పలురకాల వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలు నిలిపే విధంగా ఇక్కడ వైద్య సేవలను అందించడం చాలా అభినందనీయం అని తెలిపారు. అలాగే ఇంతంటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టి నడిపించే క్రమంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిర్విరామంగా గా సేవ చేస్తున్న శ్రీ. కుచిభొట్ల ఆనంద్ గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

అలాగే ఈ వైద్యాలయం ప్రారంభ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ. చంద్రబాబు నాయుడు గారు ఈ వైద్యాలయం ప్రోత్సాహం నిమ్మితం ఆనాడు 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయుటకు GO ఇచ్చి యున్నారు తరువాతి కాలంలో గవర్నమెంట్ మార్పు జరగడం వల్ల ఆ GO మరుగున పడడం జరిగింది ఆ GO ని తిరిగి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచడం జరుగుతుంది అని తెలియచేసినారు. అలాగే హాస్పిటల్ టాక్స్ మినహాయింపు గురుంచి  పంచాయితీరాజ్ మంత్రి వర్యులు శ్రీ. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంచడం జరుగుతుంది అని తెలిపారు. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యవస్థలు చేసే పనులు వ్యక్తులు చేయడం చూస్తూ ఉంటాము. అలాంటి సందర్భమే ఇది కూడా అని ధనంతో సంబంధం లేకుండా వైద్యం అందిస్తున్న ఈ మహోన్నత కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ. కూచిభొట్ల ఆనంద్ గారిని ఆదర్శంగా తీసుకుని ఇంకా అనేక ప్రాంతాలలో NRI లు ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టలి అని కోరుకుంటున్నట్టు తెలియచేశారు.  వైద్య ఆరోగ్య శాఖ తరుపున శాఖ పరమైన విషయాల్లో పూర్తి  సహాయ సహకారం అందించడం జరుగుతుంది అని వెల్లడించడమైనది.

అలాగే ఈ కార్యక్రమములో సభాద్యక్షులుగా స్థానిక పామర్రు శాసనసభ్యులు శ్రీ. వర్ల కుమార్ రాజ గారు వ్యవహరించారు మరియు ఆత్మీయ అతిధులుగా అవనిగడ్డ శాసన సభ్యులు శ్రీ. మండలి బుద్ధ ప్రసాద్ గారు, TV 9/ R TV ఫౌండర్ రవి ప్రకాష్ గారు పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఇది పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన వైద్యాలయం దీని కోసం అందరూ అందరూ తమవంతు సహాయ సహకారం అందిస్తామని తెలియచేయడం జరిగింది. హాస్పిటల్ చైర్మన్ శ్రీ.కుచిబొట్ల ఆనంద్ గారు మాట్లాడుతూ ఇప్పుడు హాస్పిటల్ నందు 7 విభాగాల్లో NTR వైద్యసేవ ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని దానిలో భాగం గానే ఈరోజు నుండి నూతనంగా ధన్వంతరి వార్డ్ ద్వారా మరో 30 పడకలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని ఈ ఉచిత వైద్య సేవలు ప్రజలందరూ ఉపయోగించు కోవల్సినదిగా తెలియచేసారు.

ఈ కార్యక్రమము హాస్పిటల్ అడ్మనిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ. జె. హనుమకుమార్ గారి పర్యవేక్షణలో జరుగగా కార్యక్రమములో కృష్ణ జిల్లా DMHO గీతాబాయ్ గారు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది, కూచిపూడి గ్రామ సర్పంచ్ శ్రీమతి. కె. విజయలక్ష్మి గారు, సంజీవని హాస్పిటల్ వైద్య బృందం, సిబ్బంది, హాస్పిటల్ సలహా కమిటీ సభ్యులు, పోలీసు శాఖ వారు, మీడియా మిత్రులు, ప్రజలు భారీగా విచ్చేయడం జరిగింది.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :