ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇండియ‌న్3 షాకింగ్ డెసిష‌న్

ఇండియ‌న్3 షాకింగ్ డెసిష‌న్

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్(Shankar) కెరీర్లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది ఇండియ‌న్2(Indian2). ఈ సినిమా త‌ర్వాత దానికి సీక్వెల్ గా రానున్న ఇండియ‌న్3(Indian3)కోసం ఎవ‌రూ పెద్ద‌గా ఎదురుచూడటం లేదు. ఇండియ‌న్2తో ఇప్ప‌టికే థియేట్రికల్ బిజినెస్ లో బాగా న‌ష్ట‌పోయింది నిర్మాణ సంస్థ లైకా(Lyca Productions). అందుకే ర‌జినీకాంత్(rajinikanth) వేట్ట‌యాన్(Vettayan)ను కూడా డిమాండ్ కంటే త‌క్కువ రేట్ కు అమ్మాల్సి వ‌చ్చింది.

ఇండియన్ సినిమా ఎంత హిట్ట‌యిన‌ప్ప‌టికీ ఆ మూవీపై ఇప్ప‌టి జెన‌రేష‌న్ కు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేద‌నే విష‌యం మొన్న ఇండియ‌న్2 ఓపెనింగ్స్ విష‌యంలో అర్థ‌మైపోయింది. చాలా రిస్క్ చేసి సినిమాకు భారీ బ‌డ్జెట్ పెట్టి భార‌తీయుడు బ్రాండ్ ను నాసిర‌కం క‌థాక‌థానాల‌తో దెబ్బతీశారు. ఇక అస‌లు విష‌యానికొస్తే ఇండియ‌న్3 గురించి కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ తెగ ప్ర‌చార‌మ‌వుతుంది.

ఇండియ‌న్3ని డైరెక్ట్ గా ఓటీటీ(OTT)లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంద‌నే దిశ‌గా మేక‌ర్స్ ఆలోచిస్తున్నార‌ని టాక్. థ‌గ్ లైఫ్(Thug Life) కంటే ముందుగా ఇండియ‌న్3 వ‌చ్చే ఛాన్స్ లేదు. ఒక‌వేళ త‌ర్వాత ప్లాన్ చేద్దామా అంటే ఇప్ప‌టికే బ‌డ్జెట్ మీద వ‌డ్డీలు భారీగా పెరుగుతుండ‌టంతో పాటూ ఓటీటీతో చేసుకున్న డీల్ కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ నేప‌థ్యంలో వీట‌న్నింటినీ అధిగ‌మించ‌డానికి ఇండియ‌న్3 ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేద్దామ‌ని అనుకుని ఉండొచ్చు. ఇదే నిజ‌మైతే మాత్రం ఈ విష‌యం సెన్సేష‌న్ అవుతుంది. క‌మ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఓటీటీ సినిమా చేసింది లేదు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :