ASBL Koncept Ambience
facebook whatsapp X

భారత్ పై ఆంక్షల దిశగా కెనడా...? రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ట్రూడో అడుగులు..!

భారత్ పై ఆంక్షల దిశగా కెనడా...? రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ట్రూడో అడుగులు..!

భారత్ -కెనడా మధ్య దౌత్య సంబంధాలు కట్ అయ్యాయి. భారత హైకమిషనర్ సంజయ్ తోపాటు మరికొందరు అధికారులను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా కెనడా సర్కార్ గుర్తించడంపై మండిపడిన భారత్ .. ఆదేశ అధికారులను దేశం విడచిపోవాలని ఆదేశించింది.ప్రతిగా భారతీయ దౌత్య అధికారులను.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కెనడా సైతం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇక్కడితో ఆగలేదు. ఇంకా తెగేదాకా లాగుతున్నారు కెనడా ప్రధాని ట్రూడో. ఇప్పుడు ఏకంగా భారత్ పై ఆంక్షలు విధించేదిశగా అడుగులేస్తున్నారు.

మరోసారి భారత్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ట్రూడో. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో.. భారత ఏజెంట్ల ప్రమేయముందని తమ నిఘాసంస్థలువెల్లడించిన అంశాలను తాము సమర్థిస్తున్నామన్నారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల నివేదికలో సైతం...భారత ప్రభుత్వ ఏజెంట్లు ప్రజాభద్రతకు ముప్పు కలిగించే అంశాల్లో భాగస్వాములై ఉన్నట్లు తెలిపిందన్నారు.దక్షిణాసియా కెనడియన్లను బెదిరించడం, హత్యలకుపాల్పడడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఉందని వెల్లడించారు.

భారత సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామంటూనే.. తమ దేశం చట్టాలను గౌరవించాలన్నారు ట్రూడో. మరోవైపు...లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను తెరపైకి తెచ్చింది కెనడా.. గ్యాంగ్ స్టర్స్ తో కలిసి ప్రో ఖలిస్తానీ నేతలను భారత్ టార్గెట్ చేస్తోందని ఆరోపించింది. తాజాగా ఆదేశ విదేశాంగమంత్రి ఆంక్షల ప్రస్తావన తెచ్చారు. ఆదేశ మంత్రి, న్యూడెమొక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్.. కెనడాలో సిక్కుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ పై నిర్ణయాత్మక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. భారత దౌత్యవేత్తలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం.. ఇక భారత్ పై దౌత్యపరమైన ఆంక్షలు విధించాలని సూచిస్తున్నామన్నారు. మనదేశంలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :