ASBL Koncept Ambience
facebook whatsapp X

జస్టిన్ ట్రూడో యూటర్న్.. కెనడా ప్రధాని తీరుపై భగ్గుమన్న భారత్...

జస్టిన్ ట్రూడో యూటర్న్.. కెనడా ప్రధాని తీరుపై భగ్గుమన్న భారత్...

ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో భారత్ పై కెనడా చేస్తున్న ఆరోపణల్లో పసలేదా..? తమకు ఆధారాలివ్వకుండా ఆరోపణలు చేస్తున్నారన్న మోడీ సర్కార్ వ్యాఖ్యలు నిజమేనని.. ఎట్టకేలకు కెనడా ప్రధాని ట్రూడో పరోక్షంగా అంగీకరించారు.కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందు తాజాగా కెనడా ప్రధాని జస్టిస్ట్ ట్రూడో యూటర్న్ తీసుకున్నాడు. కేవలం నిఘా సమాచారం ఆధారంగా భారత్ పై ఆరోపణలు చేశానని, ఆ సమయంలో ఎటువంటి ఆధారాలు లేవని అంగీకరించారు.

గత ఏడాది నిజ్జర్ ను హతమార్చడంలో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఇన్నాళ్లు ఆరోపించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ప్రస్తుతం యూటర్న్ తీసుకోవటంపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. చాలా రోజులుగా తాము చెబుతున్న విషయమే ఈరోజు నిర్ధారణ అయిందని అన్నారు భారత అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ . భారత్ – కెనడా సంబంధాలు దెబ్బతినడానికి ట్రూడో ప్రవర్తనే కారణమంటూ రణధీర్ జైశ్వాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి 1997లో దొంగ పాస్ పోర్టు కింద కెనడా వెళ్లాడు. 2007లో అతడికి కెనడా పౌరసత్వం లభించింది. పంజాబ్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు కొన్నేళ్లుగా నిరసనలు చేస్తున్నారు. వారిని భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించింది.

అయితే, ఖలిస్తానీ అగ్రనేత నిజ్జర్ గతేడాది హత్యకు గురయ్యాడు. దీని వెనుక భారత్ ప్రమేయం ఉందని ట్రూడో సర్కార్ ఆరోపిస్తూ వస్తోంది. ఫెడరల్ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ఎలాగైనా ఎన్డీపీ మద్దతు సాధించడం, లేదంటే దాని ఓటర్లను ఆకర్షించడం లక్ష్యంగా జస్టిన్ ట్రూడో భారత్ పై కాలు దువ్వుతున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో దర్యాప్తునకు సహకరించాలని జీ20 ముగింపు సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కోరారు.

భారత భద్రతా సంస్థలు మరింత దర్యాప్తు చేయాలని, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారు.. వారిని అరెస్టు చేయాలని నరేంద్ర మోడీ టూడోకూ సూచించారు. దీంతో.. తమను విమర్శించే ధోరణి భారత్ అవలంభిస్తోందన్న విషయం... జీ20 నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లిన తరువాత అర్ధమైందని టూడో ఇటీవల చెప్పుకొచ్చారు. మరోవైపు కెనడియన్లకు సంబంధించిన సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు సేకరించారని, వాటిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు అందజేశారని మరోసారిసారి ట్రూడో ఆరోపించారు..

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :