డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో .. జై భట్టాచార్యకు కీలక పదవి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు తదుపరి డైరెక్టరుగా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించారు. ఈ మేరకు ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాబర్ట్ ఎఫ్. కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య ఎన్‌ఐహెచ్‌ను నడిపించడంతో పాటు దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణల కోసం కృషి చేస్తారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు వీరిద్దరూ కలిసి పనిచేస్తారు అని అందులో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేసిన జై భట్టాచార్య అధ్యక్షుడు విధించిన లక్ష్య సాధనకు కృషి చేస్తానని తెలిపారు.
Tags :