భారతీయ సంస్కృతిని పటిష్టం చేయాలి : రాష్ట్రపతి
భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్టం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్‌మంథన్ ప్రధాన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్ భావన నెలకొల్పాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్ మంథన్ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 2018లో రాంచీలో లోక్‌మంథన్ కార్యక్రమంలో పాల్గొన్నా., భారతీయ సంస్కృతిక, సంప్రదాయాల పటిష్ఠానికి ఈ ప్రయత్నం గొప్పది. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిలో భాగం. ఇది ఇంధ్రదనస్సులోని సౌందర్యాన్ని సూచిస్తుంది అని అన్నారు.
Tags :