ASBL Koncept Ambience
facebook whatsapp X

న్యూ జెర్సీ లో రేవంత్ రెడ్డి తో ఇండియన్ డయాస్పోరా సమావేశం - భారీ ఏర్పాట్లు 

న్యూ జెర్సీ లో రేవంత్ రెడ్డి తో ఇండియన్ డయాస్పోరా సమావేశం - భారీ ఏర్పాట్లు 

తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి మొదటి సారిగా ఆధికారికంగా అమెరికా వస్తున్న సందర్భంగా  ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ( ఐఓసీ )పర్యవేక్షణ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ వివరాలు గురించి  ఐఓసీ, నార్త్ ఈస్ట్ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ ప్రదీప్ సామల. మాట్లాడుతూ శ్రీ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ప్రకటించగానే అన్ని వైపులా నుంచి అన్ని పట్టణాల నుంచి మంచి స్పందన వచ్చిందని, అందుకు కారణం శ్రీ రేవంత్ రెడ్డి ఛరిస్మా అని, అమెరికాలో ఆయన కు వున్న ఫాలోయింగ్ అని , అందుకు తగ్గట్టు గానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆదివారం, 4 ఆగస్టు 2024 వ తేదీన న్యూ జెర్సీ లో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో ఇండియన్ డయాస్పోరా పేరిట ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశామని, అమెరికాలో  శ్రీ రేవంత్ రెడ్డి బృందం వాషింగ్టన్ డీసీ, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగారాలు వెళుతున్నా న్యూ జెర్సీ లో మాత్రమే పబ్లిక్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. 

ముఖ్య మంత్రి , తెలంగాణ రాష్ట్ర మంత్రులు, అధికారులు ఉన్న హోటల్ నుంచి సభా స్థలం వరకు ఒక కార్ ర్యాలీ లో శ్రీ రేవంత్ రెడ్డి ని ఘన స్వాగతం తో తీసుకు వస్తామని, 12 గంటలకు మొదలయ్యే ఈ సమావేశంలో తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే  విధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడటం  ఉంటాయని తెలిపారు. అందరికీ వేరే హాల్ లో లంచ్ కూడా ఏర్పాటు చేశామని,  దాదాపు 3000 మందికి పైగా కాంగ్రెస్ అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులు వస్తారని, రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో మెయిన్ హాల్ లోనే కాకుండా సైడ్ హాల్ లో కూడా సీటింగ్ - వీడియో స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రదీప్ సామల తెలిపారు. ఐఓసీ నార్త్ ఈస్ట్ చాప్టర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ ప్రదీప్ సామల కిందటి సంవత్సరం శ్రీ  రాహుల్ గాంధీ న్యూయార్క్ - న్యూ జెర్సీ పర్యటన విజయవంతం చేయడం లో ముఖ్య పాత్ర పోషించిన విషయం చాలా మందికి తెలిసిందే!! 

ఐఓసీ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ రాజేశ్వర్ గంగసాని మాట్లాడుతూ తెలంగాణ ఎన్ఆర్ఐ ల అభిమాన నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి అమెరికా రావటం అందరికీ చాలా సంతోషకరమైన విషయం అని, మొదటగా న్యూ జెర్సీ నుంచే పర్యటన ప్రారంభ కావటం, ఇక్కడనే ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు కు కూడా అంగీకరించడం వలన ఈ సభ ని ఏర్పాటు చేసే అవకాశం మాకు వచ్చిందని అన్నారు. ఐఓసీ తో పాటు స్థానిక సంస్థలు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ముందుకు వచ్చి ఈ సభను విజయవంతం చేయడానికి సహాయ పడుతున్నారని వారికి కృతఙ్ఞతలు తెలిపారు. వ్యక్తి గతం గా తన తరుపున మరియు ఐఓసీ తెలంగాణ చాప్టర్ తరుపున  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉత్పాదన మీద కొన్ని సూచనలు చేయబోతున్నామని, డెన్మార్క్, స్వీడన్ దేశాలలో  సోలార్ సిస్టం మీద ప్రజలకు అవగాహన కలిగించి, ప్రజలచే ప్రతి ఇంటిలోనూ, ఆఫీస్ లోనూ  సోలార్ సిస్టం ద్వారా విద్యుత్ ఉత్పాదన పెంచుకొని విద్యుత్ కొరత ను అధిగమించారని తెలిపారు. అలాగే హైదరాబాద్ లాంటి నగరం లోనే కాదు చిన్న గ్రామాలలో కూడా సైకిల్ తొక్కడం మానేశారని, సైకిల్ వాడకం మంచి అరొగ్య సాధనం మరియు ఉపయోగపడే రవాణా సాధనం అని, ప్రభుత్వం ఈ సైకిల్ వాడకం మీద ప్రచారం చేయాలని, నగరం లో, ఇతర పట్టణాలలో ప్రతి రోడ్ మీద సైకిల్ ట్రాక్ లు ఏర్పాటు చేయాలని కూడా తాము ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి సూచనలు చేస్తామని శ్రీ రాజేశ్వర్ గంగసాని అన్నారు 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :