ASBL Koncept Ambience
facebook whatsapp X

INS అరిఘాత్ తో భారతనేవీ శతృ దుర్భేధ్యం..

INS అరిఘాత్ తో భారతనేవీ శతృ దుర్భేధ్యం..

అణుత్రయంలో అత్యంత కీలకమైన, బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన అణు జలాంతర్గామి.. ‘INS అరిఘాత్ అరిఘాత్‌’ నేవీ అమ్ములపొదిలోకి చేరింది. INS అరిహంత్‌ తర్వాత దేశీయంగా భారత్‌ అభివృద్ధిచేసుకున్న రెండో ‘న్యూక్లియర్‌ పవర్డ్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ సబ్‌మెరైన్‌’ ఇది. శత్రుదేశాల్లోని సైనిక స్థావరాలను, అణువిద్యుత్‌ కేంద్రాలు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేసే స్ట్రాటజిక్‌ క్షిపణులను నీటి అడుగునుంచి ప్రయోగించగలదు. భారతదేశ తొలి అణు జలాంతర్గామి INS చక్ర.. రష్యా నుంచి లీజుకు తీసుకున్నది.

అయితే, పదిహేనేళ్ల క్రితం సొంతంగా అణు జలాంతర్గాముల నిర్మాణాన్ని చేపట్టిన భారత్‌.. విశాఖలోని నేవీ షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో వాటిని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగాఅభివృద్ధి చేసిన తొలి SSBN (షిప్‌, సబ్‌మెర్సిబుల్‌,బాలిస్టిక్‌, న్యూక్లియర్‌).. INS అరిహంత్‌ అధికారికంగా 2018 నుంచి నేవీకి సేవలందిస్తోంది. ఆ డిజైన్‌, స్ఫూర్తితో.. దానికన్నా శక్తిమంతంగా రూపొందించిన SSBN.. ఈ INS అరిఘాత్‌. ఇప్పటికే దీన్నిఅనేకసార్లు సముద్రంలో పరీక్షించి, కమిషనింగ్‌ చేశారు. అరిహంత్‌ క్లాస్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్లలో అరిఘాత్‌ రెండోది.

అయితే..అరిహంత్‌లో 750 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగే కె-15క్షిపణులు ఉంటాయి. దీంట్లో.. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల నాలుగు K-4 SLBM (సబ్‌మెరైన్‌ లాంచ్‌డ్‌ బాలిస్టిక్‌ క్షిపణుల)ను మోహరించవచ్చు. లేదా సంప్రదాయ/స్ట్రాటజిక్‌ అణువార్‌హెడ్లను మోసుకెళ్లగల 12 కె-15 SLBMలను అమర్చవచ్చు. 3500 కిలోమీటర్లంటే..బంగాళాఖాతంలోని ఉత్తర భాగం నుంచి ప్రయోగిస్తే బీజింగ్‌ కూడా దీని పరిధిలోకి వస్తుందన్నమాట! దీనికి.. ప్రెజరైజ్డ్‌ వాటర్‌ రియాక్టర్‌తో పనిచేసే ఏడు బ్లేడ్‌ల ప్రొపెల్లర్‌ ఉంటుంది.

సముద్ర ఉపరితలంపై గంటకు 12 నుంచి 15 నాటికల్‌ మైళ్ల (22 నుంచి 28 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది. అదే సముద్రం లోపల అయితే గంటకు 24 నాటికల్‌ మైళ్ల (44 కిలోమీటర్ల) వేగంతో వెళుతుంది. ఇందులో ఉపయోగించే క్షిపణులను డీఆర్‌డీవో రూపొందించింది. ఇక.. ఈ సిరీస్ లోని మూడో అణు జలాంతర్గామి కూడా త్వరలో నేవీకి అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :