ASBL Koncept Ambience
facebook whatsapp X

అంతర్జాతీయ ఎక్స్‌పో కు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

అంతర్జాతీయ ఎక్స్‌పో కు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

గ్రేటర్‌ నోయిడాలో నిర్వహించే నిర్మాణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ బౌమా కాన్‌ ఎక్స్‌పోకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని అక్కడి నిర్వాహకులు ఆహ్వానించారు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, మెస్సె ముంచన్‌ ఇండియా సంస్థలు ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నాయి. నిర్మాణ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతికత, యంత్ర పరికరాల తయారీదారులతో ఈ ఏడాది డిసెంబరు 11 నుంచి 14 వరకు నోయిడాలో నిర్వహించాలని నిర్ణయించాయి. అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రిని కలిసి ఆహ్వానాన్ని అందించారు.
.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :