ASBL Koncept Ambience
facebook whatsapp X

టీఎఫ్ఏఎస్ ఆధ్వర్యంలో కథల పోటీలకు ఆహ్వానం.. విజేతలకు క్యాష్ ప్రైజులు

టీఎఫ్ఏఎస్ ఆధ్వర్యంలో కథల పోటీలకు ఆహ్వానం.. విజేతలకు క్యాష్ ప్రైజులు

తెలుగు కళా సమితి (టీఎఫ్ఏఎస్) ఆధ్వర్యంలో తెలుగు జ్యోతి సంక్రాంతి పోటీలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహిక రచయితలకు తెలుగు జ్యోతి సంపాదక వర్గం ఆహ్వానం పలికింది. తమ కథలు, కవితలను నవంబరు 15వ తేదీలోగా tjarticles@tfas.netకి పంపాలని తెలుగు తెలిపింది. ఈ పోటీల్లో పెద్దల కథల పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి కింద 100 డాలర్లు, రెండో బహుమతిగా 50 డాలర్లు క్యాష్ ప్రైజ్ అందించనున్నారు. అలాగే పెద్దల కవితలకు కూడా మొదటి బహుమతిగా 50 డాలర్లు, రెండో బహుమతిగా 25 డాలర్లు అందిస్తారు. చిన్నపిల్లలు రాసిన కథలు, కవితలకు కూడా ఇదే మాదిరిగా 50 డాలర్లు, 25 డాలర్ల క్యాష్ ప్రైజ్ అందజేయనున్నట్లు తెలుగు జ్యోతి నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీల గురించి మరిన్ని వివరాల కోసం editor@telugujyothi.com మెయిల్‌ను సంప్రదించగలరు. అయితే ఈ రచనలు పంపడానికి కొన్ని షరతులున్నాయి. అవేంటంటే..

1. రచనలను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్ రూపంలోనే పంపాలి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో కాదు.
2. యూనికోడ్ ఫాంట్స్ వాడాలి. అనుస్క్రిప్ట్ ఫాంట్స్ వాడకూడదు.
3. ఈ రచనలు సింగిల్ స్పేస్‌లో 8 పేజీలలోపు ఉండాలి.
4. వ్యాకరణం, విరామ చిహ్నాలను జాగ్రత్తగా అనుసరించాలి.
5. గతంలో తెలుగు జ్యోతికి పంపిన రచనలను ఈ సంవత్సరం మల్లీ పరిశీలించడం జరగదు.
6. మీ రచనలతోపాటు మీ పేరు, ఊరు, చిరునామా, ఈమెయిల్ అడ్రస్, మీ పరిచయం, రచన మీ స్వంతమే అని, మరెక్కడా ప్రచురించలేదని మీ ధ్రువీకరణ కూడా పంపాలి.
7. తెలుగు జ్యోతి సంపాదక వర్గ సభ్యులూ, న్యూజెర్సీ తెలుగు కళాసమితి కార్యవర్గ సభ్యులూ, వారి కుటుంబ సభ్యులూ ఈ బహుమతులకు అర్హులు కారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :