ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సన్నాహాలు.. పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందా..?
ఇరాన్ క్షిపణీ స్థావరాలు, సైనిక కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఇరాన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇజ్రాయెల్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా... దాడికి సన్నద్ధం కావాల్సిందేని సైన్యానికి ఆదేశ అత్యుత్తమనేత ఖొమైనీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.ఈదాడి చాలా కచ్చితంగా , ఇజ్రాయెల్.. ఆదేశానికి మద్దతుగా ఉన్న దేశాలకు పరిస్థితి అర్థమయ్యేలా ఉండాలన్నది ఆ ఆదేశాల సారాంశంగా తెలుస్తోంది. మరోవైపు దాడులకు ఇదే సరైన సమయంగా ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారంలోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంటే అమెరికాలో అధికారం చేతులు మారే సమయమన్నమాట. అందువల్ల అక్కడ పూర్తిగా క్లారిటీ వచ్చేలోపు గట్టిదాడులు జరపాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే .. సాదారణంగా అమెరికాలో పాలన విధానం.. పార్టీలు మారినంత ఈజీగా మారదు. కానీ.. మితవాదం, అతివాదం అన్నట్లుగా ఉంటుందంతే.. ఇక్కడ ఇరాన్ మరో ఎత్తుగడలో ఉంది. తమ భూభాగం నుంచి దాడులు చేస్తే.. ఇరాన్ ప్రతిదాడులకు ఉపక్రమిస్తోంది. అందువల్ల పొరుగున ఉన్న ఇరాక్ నుంచిదాడులకు దిగాలన్నది ఇరాన సంకల్పంగా తెలుస్తోంది. ఇరాక్ లోని ఇరాన్ అనుకూల ఉగ్రనేతల ఆధ్వర్యంలో దాడులకు ప్లాన్ వేసినట్లు సమాచారం. అలా జరిగితే.. ఇరాన్ పై నేరుగా ఇజ్రాయెల్ దాడులు చేయలేదన్నది టెహ్రాన్ ప్లాన్ గా భావిస్తున్నారు.
అదే జరిగితే.. ఇక ఇజ్రాయెల్ .. నేరుగా ఇరాక్ పైనా దాడులు చేయాల్సి వస్తుంది . ఇప్పటికే హెజ్ బొల్లా కోసం లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ యుద్ధంచేస్తోంది. ఇప్పుడు ఇరాన్ అనుకూల ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు.. ఇరాక్ పైనా దాడులు చేయాల్సి వస్తుంది. ఈపరిణామం సహజంగానే అమెరికా మిత్రదేశాలకు ఇబ్బందికరంగా మారనుంది. ఎందుకంటే.. యుద్ధం పరిధిలోకి వస్తున్న ముస్లిం దేశాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. అమెరికా, మిత్రదేశాలకు ఉన్న కాస్త పట్టు పోయే పరిస్థితి ఉంది.
ఇప్పటివరకూ యూఏఈ, కువైట్, టర్కీ సహా పలు దేశాలు ఇన్ డైరెక్టుగా అమెరికాకు మద్దతుగా ఉన్నాయి. ఇప్పుడిలా దాడులు పెరుగుతూ పోతే.. తమ పరిస్థితి ఏంటని ఆయాదేశాలు ఆందోళనలో పడే ప్రమాదముంది. ఫలితంగా ఆ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలకు సహకరించే దేశాలు చేజారిపోతే.. పరిస్థితి ప్రతికూలంగా పరిణమించనుందని చెప్పవచ్చు.