సమంత సిరీస్ సక్సెస్ అయినట్టేనా?
వరుణ్ ధావన్(Varun Dhawan), సమంత(Samantha) జోడీగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ(Citadel Honey Bunny) వెబ్ సిరీస్ రీసెంట్ గా ప్రైమ్ వీడియో(Prime Video)లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్ సగటున 50 నిమిషాలుండే ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సిరీస్ పై అందరూ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
రివ్యూలు కూడా డీసెంట్ గానే వచ్చాయి కానీ ప్రైమ్ ఆశించినట్లు సిటాడెల్ అద్భుతాలు మాత్రం చేయలేకపోతుంది. సిటాడెల్ కూడా మీర్జాపూర్(Mirzapur), బ్రీత్(Breath), ది ఫ్యామిలీ మ్యాన్(The Family Man) లానే బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశించారు కానీ సిటాడెల్ ఆ స్థాయిలో లేకపోవడం వల్ల ఫ్యాన్స్ కూడా నిరాశపడ్డారు. అయితే దీనికి కారణం కథను డ్యూయల్ లేయర్ ఫార్మాట్ లో నెరేట్ చేయడమే. దీంతో కామన్ ఆడియన్స్ కు సిటాడెల్ పెద్దగా కనెక్ట్ కాలేదు.
స్ట్రయిట్ నెరేషన్ అయితే సిరీస్ స్థాయి వేరేలా ఉండేది. సీన్స్, ఫైట్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి తప్పించి వావ్ అనిపించేలా ఉండవు. మరోసారి చూడాలి అనే విధంగా అసలే ఉండదు. ప్రమోషన్స్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ సిరీస్ పర్వాలేదనిపించుకుంటే సక్సెస్ అయినట్లు కాదు. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడం సిటాడెల్ కు చాలా పెద్ద నష్టమనే చెప్పాలి. రిజల్ట్ ఎలా ఉన్నా దీని వల్ల సమంతకు మాత్రం మంచి పేరే వచ్చింది.