ASBL Koncept Ambience
facebook whatsapp X

విజ‌య్69 ఆ సినిమాకు రీమేకా?

విజ‌య్69 ఆ సినిమాకు రీమేకా?

పొలిటిక‌ల్ ఎంట్రీకి ముందు త‌మిళ స్టార్ హీరో విజ‌య్(Vijay) చివ‌రి సినిమాగా ప్ర‌చారంగా ఉన్న విజ‌య్69(Vijay69) కు సంబంధించి ప్ర‌స్తుతం కొన్ని లీకులు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్న టైమ్ లో క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేస్తే నెగిటివ్ కామెంట్స్ వ‌స్తాయేమోన‌ని ఏదైనా మెసేజ్ ఉండే క‌థ‌ను చూడ‌మ‌ని డైరెక్ట‌ర్ హెచ్ వినోత్‌(H vinoth)కు విజ‌య్ చెప్పాడ‌ట‌.

అందులో భాగంగానే బాల‌కృష్ణ(Bala Krishna)- అనిల్ రావిపూడి(Anil Ravipudi) క‌లయిక‌లో వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన భ‌గ‌వంత్ కేస‌రి(Bhagavanth Kesari)ని కీల‌క మార్పుల‌తో త‌మిళ నేటివిటీకి త‌గ్గ‌ట్టు వినోత్ తీర్చిదిద్దాడ‌ని టాక్. కోర్ పాయింట్ ను మాత్ర‌మే తీసుకుని రెండు సినిమాల‌కు పోలిక రాకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కైతే ఇదంతా పుకారే కానీ ఆ వార్త‌ల‌కు బ‌ల‌మిచ్చేలా విజ‌య్69 కాస్టింగ్ క‌నిపిస్తోంది.

అందులో మొద‌టిది ఓ కీల‌క పాత్ర కోసం ప్రేమ‌లు(Premalu) ఫేమ్ మ‌మిత బైజు(Mamitha Baiju)ని ఎంపిక చేశారు. మ‌మిత‌ను విజ‌య్‌కు జోడీగా తీసుకునే డేర్ చేయ‌రు కాబ‌ట్టి శ్రీలీల(Sree Leela) క్యారెక్ట‌ర్ కోసం అనుకోవ‌చ్చు. ఇక కాజ‌ల్(Kajal) ప్లేస్‌లో పూజా హెగ్డే(Pooja Hegde) వ‌చ్చింద‌ని టాక్. అంతేకాదు విల‌న్ గా బాబీ డియోల్(Bobby Deol) ను కూడా లాక్ చేశారు. కాబ‌ట్టి చాలా విష‌యాల్లో విజ‌య్69 కాస్టింగ్ భ‌గ‌వంత్ కేస‌రితో మ్యాచ్ అవుతుండటంతో ఇది బాల‌య్య మూవీకి రీమేకే అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఇదెంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే క‌నీసం టీజ‌ర్ వ‌చ్చే వ‌ర‌కైనా ఆగాల్సిందే.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :