ASBL Koncept Ambience
facebook whatsapp X

విశ్వం ద‌స‌రా బ‌రిలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

విశ్వం ద‌స‌రా బ‌రిలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

హీరో గోపీచంద్‌(GOpichand)కు, డైరెక్ట‌ర్ శ్రీను వైట్ల‌(Srinu Vaitla)కు వారి కెరీర్లో ఎంతో కీల‌క‌మైన సినిమా విశ్వం(Viswam). లౌక్యం(Loukyam) త‌ర్వాత గోపీచంద్‌కు మ‌రో స‌క్సెస్ లేదు. ఆ త‌ర్వాత గోపీచంద్ చేసిన ప్ర‌తీ సినిమా డిజాస్ట‌ర్ గానే మిగిలింది. శ్రీను వైట్ల‌కు కూడా బాద్‌షా(Baad Shah) త‌ర్వాత హిట్ పడింది లేదు. దీంతో శ్రీను వైట్ల కెరీర్లో చాలానే గ్యాప్ వ‌చ్చింది. ఎంతో క‌ష్టం మీద గోపీచంద్‌తో విశ్వంను లైన్‌లో పెట్టాడు.

ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న రిలీజ్ చేస్తున్న‌ట‌లు కొన్ని వారాల కింద‌ట అనౌన్స్ చేశారు. కానీ త‌ర్వాత నుంచి మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ద‌స‌రా బ‌రిలో ఉన్న సినిమాల‌న్నీ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టి హైప్ పెంచుకుంటుంటే, అస‌లేమాత్రం క్రేజ్ లేని విశ్వం మూవీ మాత్రం ఎలాంటి ప్ర‌మోష‌న్స్ చేయ‌కుండా సైలెంట్ గా ఉంది.

బ‌జ్ త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ప్ర‌మోష‌న్స్ గ‌ట్టిగా ప్లాన్ చేసి మంచి ప్రోమోలు రిలీజ్ చేసి బ‌జ్ పెంచే ప్ర‌య‌త్నం చేస్తే క‌నీసం ఓపెనింగ్స్ అయినా బావుంటాయి. కానీ టీమ్ మాత్రం ప్ర‌మోష‌న్స్ విష‌యంలో సైలెంట్ గా ఉంటుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో బిజీగా ఉండి సైలెంట్ గా ఉన్నారా లేక ద‌స‌రాకు త‌మ సినిమాను రిలీజ్ చేసే ఉద్దేశం లేక సైలెంట్ అయ్యారా అనేది అనుమానంగా ఉంది.  మ‌రో రెండు రోజులు ఇదే సైలెన్స్ ను మెయిన్‌టెయిన్ చేస్తే విశ్వం ద‌స‌రా రేసు నుంచి త‌ప్పుకున్న‌ట్లే భావించాలి. 

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :