ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడరేనా...?

ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్ ఇరాన్ సుప్రీం లీడరేనా...?

హెజ్బొల్లా అధినేత హసన్ నస్రుల్లా మరణంతో మిడిల్ ఈస్ట్ తగులబడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. నస్రుల్లా తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలి ఖమేనీ ఇజ్రాయెల్‌కు తదుపరి లక్ష్యం అయ్యే అవకాశం ఉందన్న వార్తల మధ్య ఆయన్ను హై సెక్యూరిటీ మధ్య సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించారు.లెబనాన్‌లోని సామాన్యులపై దాడుల ద్వారా ఇజ్రాయెల్‌ మరో సారి తమ క్రూరమైన జియోనిస్ట్ తత్త్వాన్ని ప్రపంచానికి చాటుకుందని ఖమేనీ ట్వీట్ కూడా చేశారు.

మొన్న హమాస్ చీఫ్... నిన్న హెజ్బొల్లా అధినేత.. తర్వాత ..?

హమాస్ ను కూకటివేళ్లతో పెకలిస్తామని భీషణ ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్.. ఏడాదికి పైగా భీకర దాడులు చేస్తోంది. ఈదాడుల్లో వేలమంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చింది. సంవత్సరాల కృషి ఫలించి.. హమాస్ చీఫ్ ను మట్టుబెట్టింది. తర్వాాత వంతుగా హెజ్బొల్లాను వెంటాడుతోంది. లేటెస్టుగా చీఫ్ హసన నస్రూల్లాను హతమార్చింది. అంటే తమను ఎవరైతే ఎదిరిస్తారో.. వారి నేతలను మట్టుపెడుతూ వస్తోంది ఇజ్రాయెల్. దీంతో ఇప్పుడు తమను ఇరాన్ గట్టిగా దెబ్బతీసింది కాబట్టి... ఆదేశ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చే ప్రమాదముందన్న ఆందోళనలున్నాయి.

హెజ్బొల్లా అధినేత హసన్‌ నస్రుల్లా మరణంతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఒక్క సారిగా ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని దేశంలోనే సురక్షిత ప్రాంతానికి హై సెక్యూరిటీ మధ్య తరలించారు. దానికి ముందు ఆయన తన నివాసంలో సెక్యూరిటీ రివ్యూ చేశారు. కమాండర్లు చనిపోయినంత మాత్రాన హెజ్బొల్లా బలహీనపడదని ఖమేనీ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు లెబనాన్‌ పక్షాన నిలవాలని ఖమేనీ సూచించారు. నస్రుల్లా మరణ వార్తల తర్వాత ఇరాన్ ఆ ప్రాంతంలో ఉన్న ప్రాక్సీ గ్రూప్‌లతో పాటు తమ మిత్ర దేశాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ పరిస్థితిని అంచనా వేస్తూ వస్తోంది.

అటు.. యూఎన్‌జీఏలో రెండు మ్యాప్‌లు ప్రదర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ అందులో ఒక దానికి శాపంగా మరో దానికి వరంగా పేరు పెట్టారు. శాపంగా పేర్కొన్న మ్యాప్‌ నల్ల రంగులో ఉండగా అందులో పాలస్తీనాను అసలు చూపలేదు. ఇరాన్‌, లెబనాన్‌, సిరియా, యెమెన్‌ దేశాలను నల్ల మ్యాపులో చూపించి వీటిని మధ్యప్రాశ్చ్యానికి శాపంగా పేర్కొన్నారు. పచ్చటి మ్యాప్‌లో భారత్ సహా సౌదీ అరేబియా, సూడాన్ వంటి దేశాలను చూపించారు. పచ్చటి మ్యాపులో ఉన్న దేశాల్లో కొన్నింటితో ఇజ్రాయెల్‌ ప్రస్తుతానికి ఏ విధమైన సంబంధాలు కలిగి లేదు. అయితే భవిష్యత్‌లో వాటికి స్నేహహస్తం చాచేందుకు నెతన్యాహూ ఇలా చేస్తున్నట్లు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :