ASBL NSL Infratech

తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ల విస్తరణ : మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ల విస్తరణ : మంత్రి శ్రీధర్‌బాబు

మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ల విస్తరణను వేగంగా పూర్తి చేయాలని, వచ్చే ఏడాది నాటికి కార్యకలాపాలు ముమ్మరం చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ రంగాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు.  డేటా సెంటర్లకు సంబంధించి భూసమస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

మైక్రోసాఫ్ట్‌ సంస్థ రంగారెడ్డి జిల్లా మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, చందన్‌పల్లిలో 52 ఏకరాలు కొనుగోలు చేసింది. డేటా సెంటర్ల పనులు 70 శాతం పూర్తయ్యాయని, మేకగూడలోని భూమిపై స్థానిక గ్రామ పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు ప్రస్తావించారు.  వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంకను శ్రీధర్‌బాబు ఆదేశించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరద నీటి కాలువ నిర్మాణాలను గడువులోగా ముగిస్తామని, పెండిరగ్‌ పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లభించినందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :