ASBL NSL Infratech
facebook whatsapp X

ప్రతిపక్ష హోదా కోసం జగన్ న్యాయపోరాటం? మరి హైకోర్టులో ఏం జరుగుతుంది..

ప్రతిపక్ష హోదా కోసం జగన్ న్యాయపోరాటం? మరి హైకోర్టులో ఏం జరుగుతుంది..

తాజాగా ఆంధ్రాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో  జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. వై నాట్ 175 అని ఎంతో కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగినప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. అయినా సరే వెనక్కి తగ్గకుండా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందని వైసీపీ అధినేత జగన్ పట్టుబడుతున్నారు. ఈ మేరకు ఆయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేక కూడా రాసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఆయన ఈ లేఖ పై స్పందించలేదు. 

ఈ నేపథ్యంలో జగన్ ప్రతిపక్ష హోదా కోసం న్యాయపోరాటం చేయడానికి పూనుకున్నారు. మీరైనా నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించండి అంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలు చిక్కులు తెరమీదకి రాబోతున్నాయి అన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా జగన్ న్యాయపోరాటానికి ధీటుగా రెడీ అన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. హైకోర్టు వరకు వెళ్లారు బాగానే ఉంది కానీ అసలు సభకు ఎన్ని రోజులు వచ్చారు? అలాంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రయోజనం ఏమిటి? ప్రతిపక్ష హోదా ఇస్తేనే మీరు సభకు వస్తారా? అంటే మీకు కేవలం పదవులు ముఖ్యం కానీ ప్రజలు కాదా అంటూ ప్రశ్నలతో హోరెత్తించడానికి కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. కొందరైతే ఇదే విషయాన్ని నర్మగర్భంగా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. 

చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూన్లో మూడు రోజులపాటు సభ జరిగింది. ఆ సమయంలో రెండు రోజులు ప్రమాణస్వీకారం జరిగాయి. అయితే జగన్ కేవలం తొలిరోజు సభకు వచ్చి తన ప్రమాణ స్వీకారం కాస్త పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. మూడవ రోజు స్పీకర్ ఎన్నిక జరిగిన సమయంలో కూడా జగన్ సభకు రాలేదు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇక ఎప్పుడు ఐదు రోజుల పాటు సభలు జరిగాయి. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన బడ్జెట్ సభలలో జగన్, వైసీపీ పదిమంది ఎమ్మెల్యేలు తొలిరోజు మాత్రమే సభకు వచ్చారు. అది కూడా కేవలం 16 నిమిషాలు జగన్ సభలో ఉన్నారు. తన నిరసన వ్యక్తం చేసి ఇక అక్కడి నుంచి ఢిల్లీలో ధర్నాకి ప్రయాణమయ్యారు. రేపు హైకోర్టులో ఒకవేళ కేసు విచారణ సందర్భంగా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లయితే దీనికి జగన్ ఏమి సమాధానం చెబుతారు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియదు కానీ మొత్తానికి ఈ విషయంపై హైకోర్టు చేత మరొకసారి జగన్ మొట్టికాయలు వేయించుకోవడం కన్ఫామ్ అని అనిపిస్తుంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :