ASBL Koncept Ambience
facebook whatsapp X

జగన్ కు జగనే సాటి.. ప్రత్యేకంగా వేరొకరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు..

జగన్ కు జగనే సాటి.. ప్రత్యేకంగా వేరొకరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు..

రీసెంట్ గా ఏపీలో జరిగిన 6వ అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజులపాటు రెండు భాగాలుగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న శుక్రవారంతో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. అయితే మొత్తం ఆరు రోజులపాటు సాగిన సభలో ముఖ్యమంత్రి మూడు ప్రకటనలు చేశారు. అలాగే రెండు బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గవర్నర్ ప్రసంగం రోజున హాజరయ్యారు. 

కొద్దిసేపు గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆ తర్వాత మెల్లిగా వాకౌట్ అయిపోయారు. తిరిగి మళ్ళీ సమావేశాల జోలికి ఆయన వెళ్ళింది లేదు. అయితే సభ మాత్రం జగన్ చుట్టూ తిరిగింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద జరిగిన చర్చలో కూడా సభలో జగన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. జరిగింది అసెంబ్లీ సమావేశాలు లాగా కాకుండా జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకల గురించి డిస్కషన్ లాగా సమావేశం సాగింది. లిక్కర్ స్కామ్ మీద శ్వేత పత్రం రిలీజ్ చేసిన సందర్భంగా కూడా జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఘాటుగా చర్చ జరిగింది. అలాగే ఈ ఐదేళ్ల కాలంలో టిడిపి ఎమ్మెల్యేలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి అన్న విషయంపై కూడా సభలో డిస్కషన్ జరిగింది. చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అందరూ జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల లిస్ట్ చదివారు.

ఇలా మొత్తానికి జగన్ అసెంబ్లీకి రాకపోయినప్పటికీ గత ఐదేళ్లలో ఆయన ప్రభుత్వం చేసిన ఘనమైన నిర్వాకాల జాబితా అసెంబ్లీ చుట్టూ తిరిగింది. మరోపక్క జగన్ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో ధర్నా అంటూ పెద్ద ఎత్తున హడావిడి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో 36 హత్యలు జరిగాయి అని మాట్లాడిన జగన్ వాళ్ళ పేర్లు చెప్పండి అని మీడియా అడగడంతో భోజనానికి టైం అయింది అని చల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు పలువురు జగన్ ప్రవర్తనను తప్పుపడుతున్నారు. మరికొందరైతే జగన్ ను ప్రత్యేకంగా వేరెవరో వచ్చి ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అతనికి అతనే పెద్ద ట్రోలర్ అన్న బిరుదుని కూడా అంటగడుతున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :