ASBL Koncept Ambience
facebook whatsapp X

YS Jagan: జగన్ డిక్లరేషన్ ఇస్తే ఒక బాధ..! ఇవ్వకపోతే మరో బాధ..!!

YS Jagan: జగన్ డిక్లరేషన్ ఇస్తే ఒక బాధ..! ఇవ్వకపోతే మరో బాధ..!!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మొత్తం ఇప్పుడు అందరి చూపూ జగన్ (YS Jagan) వైపే ఉంది. జగన్ తిరుమలకు (Tirumala) వెళ్తుండడంతో ఆయన డిక్లరేషన్ (declaration) ఇస్తారా.. లేదా.. అనే ఆసక్తి నెలకొంది. ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి పార్టీలు (NDA Alliance Parties) స్పష్టం చేస్తున్నాయి. అయితే గతంలో చాలా సార్లు తిరుమల వెళ్లాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది వైసీపీ (YCP). అయితే జగన్ విషయంలో టీటీడీ (TTD) ఏం చేస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది. డిక్లరేషన్ కోసం టీటీడీ అధికారులు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. అయితే జగన్ డిక్లరేషన్ ఇస్తే ఒక సమస్య. ఇవ్వకపోతే మరో సమస్య ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.

గతంలో వైఎస్ జగన్ (Jagan) పలుమార్లు తిరుమల వెళ్లారు. గత ఐదేళ్లు బ్రహ్మోత్సవాల (Brahmotsavams) సమయంలో శ్రీవారికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు. ఇంతకు ముందెన్నడూ జగన్ డిక్లరేషన్ సమర్పించలేదు. అక్కడ ఉన్న అధికారులంతా తన వాళ్లే కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాలని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తిరుమల లడ్డూలో (Tirumala Laddu) కల్తీ నెయ్యి (adulterated ghee) వ్యవహారం కుదిపేస్తోంది. హిందూ సంప్రదాయాలపట్ల (Hindu traditions) జగన్ కు గౌరవం లేదని.. ఆయన క్రైస్తవుడు (Christians) కాబట్టి దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. హిందూ ఆలయాలపై (Hindu Temples) గత ఐదేళ్లూ కక్షగట్టి వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తిరుమల వెళ్తున్నారు. ఆయన క్రైస్తవుడు కాబట్టి కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. సీబీఐకి (CBI) జగన్ ఇచ్చిన అఫిడవిట్ (Affidavit) లో క్రిస్టియన్ అని పేర్కొన్నారు. అలాగే తమ ఇంట్లో పెళ్లిళ్లు, చావులు.. అన్నీ కూడా క్రైస్తవ పద్ధతుల్లోనే జరుగుతాయి. జగన్ పెళ్లి కూడా క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే జరిగింది. ఇలాంటప్పుడు జగన్ హిందువు ఎలా అవుతారని ఆ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే డిక్లరేషన్ కోరుతున్నాయి. కానీ వైసీపీ మాత్రం అసలు డిక్లరేషన్ ఎందుకివ్వాలని ప్రశ్నిస్తోంది. గతంలో ఎన్నోసార్లు జగన్ తిరుమల వెళ్లారని.. ఇప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నిస్తోంది.

అయితే తిరుమలలో టీటీడీ అధికారులు జగన్ ను డిక్లరేషన్ అడిగే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు జగన్ అంగీకరిస్తారా.. లేదా.. అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఒకవేళ జగన్ డిక్లరేషన్ పై సంతకం చేస్తే తాను క్రిస్టియన్ అని అంగీకరించినట్లవుతుంది. క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవాలయాలపై కక్షగట్టారని కూటమి పార్టీలు చేస్తున్న ఆరోపణలు బలం చేకూర్చినట్లవుతుంది. ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకపోతే హిందూ సంప్రదాయాలపట్ల జగన్ కు సదభిప్రాయం లేదనే టాక్ వస్తుంది. హిందువుల్లో వ్యతిరేక భావం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లే ఏది చేసినా ఏదో ఒక సమస్య రావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :