ట్రంప్ నన్ను తొలగించలేరు .. నేను రాజీనామా చేయను
అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆదేశించినప్పటికీ, ఫెడరల్ రిజర్వ్ చీఫ్ పదవికి తాను రాజీనామా చేసేది లేదని జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. చట్టప్రకారం, ఫెడరల్ రిజర్వ్‌లోని ఏడుగురు గవర్నర్ల్లో ఏ ఒక్కరినీ ట్రంప్ తొలగించలేరని ఆయన పేర్కొన్నారు. ఫెడ్ చైర్మన్‌గా జెరోమ్ పదవీకాలం 2026లో ముగియనుంది. గవర్నర్‌గా 2028 వరకు ఉంది. ఆయన కావాలనుకుంటే ఫెడ్ చైర్మన్‌గా వైదొలిగిన తర్వాత గవర్నర్‌గా కొనసాగవచ్చు. ఫెడ్ గవర్నర్లను అధ్యక్షుడే నామినేట్ చేస్తారు. సెనేట్ ద్వారా 14 ఏళ్ల పదవీకాలానికి నియమిస్తారు. ఫెడ్ గవర్నర్ కనుక మధ్యలో పదవీ విరమణ చేసినట్లయితే, 14 ఏళ్లకు సంబంధించి మిగిలిన కాలవ్యవధికి వేరొకరిని నియమించవచ్చు.
Tags :