ASBL Koncept Ambience
facebook whatsapp X

జాన్వీ ఎగ్జామ్ పాసైన‌ట్టేనా?

జాన్వీ ఎగ్జామ్ పాసైన‌ట్టేనా?

శ్రీదేవి(Sridevi) వార‌సురాలిగా జాన్వీ క‌పూర్(Jhanhvi Kapoor) మీద టాలీవుడ్ ఆడియ‌న్స్ లో ప్ర‌త్యేక అభిమానముంది. అందుకే జాన్వీని ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాలో చూస్తామా అని సామాన్య ప్రేక్ష‌కులు కూడా ఎంతో వెయిట్ చేశారు. వ‌ర‌ని ప్రేమించే తంగ‌మ్మ‌గా జాన్వీ నిడివి  దేవ‌ర‌లో చాలా లిమిట‌డ్ గా ఉంది. కొన్ని సీన్స్, ఒక సాంగ్ కే జాన్వీని ప‌రిమితం చేశారు.

పెర్ఫార్మెన్స్ ప‌రంగా చూసుకుంటే జాన్వీకు ద‌క్కిన స్పేస్ లో ఎక్కువ జ‌డ్జ్ చేయ‌లేం. క‌నిపించిన కాసేపట్లో ఎంతో అందంగా, చ‌లాకీగా క‌నిపించి హుషారుగా న‌టించింది. కాక‌పోతే జాన్వీ తంగం పాత్ర‌ను కొర‌టాల(koratala) డిజైన్ చేసిన విధానం అంద‌రినీ మెప్పించ‌లేక‌పోయింది. ఆడియ‌న్స్ ఫోక‌స్ మొత్తం యాక్ష‌న్, ఎలివేషన్స్ పై ఉండ‌టంతో  హీరో హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ కు ప్రాధాన్యం లేక‌పోయింది.

జాన్వీ క‌పూర్ చెప్ప‌న‌ట్లు త‌న స్టామినా బ‌య‌ట ప‌డేది దేవ‌ర‌2(Devara2)లోనే. అయితే అదెప్పుడొస్తుంద‌నేది మాత్రం ఇప్ప‌ట్లో తెలిసేలా లేదు. ఇప్ప‌టికే వార్2(War2), ప్ర‌శాంత్ నీల్ సినిమాలు పూర్తి చేయాల్సిన ఎన్టీఆర్ అవి పూర్తి చేసే నాటికి మ‌రో రెండేళ్లు గ‌డిచిపోతాయి. ఈ లోపు రామ్ చ‌ర‌ణ్16 వ‌చ్చేస్తుంది. ఈ మూడు సినిమాలు హిట్ అయితే జాన్వీ ఎంచ‌క్కా టాలీవుడ్ కు మకాం మార్చేయొచ్చు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :