ASBL Koncept Ambience
facebook whatsapp X

జార్ఖండ్ బాద్షా ఎవరు? ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ బలాబలాలు..?

జార్ఖండ్ బాద్షా ఎవరు? ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ బలాబలాలు..?

గిరిజన ప్రాబల్య రాష్ట్రం జార్ఖండ్ లో గెలిచేదెవరు? అధికార పగ్గాలు చేపట్టేదెవరు? ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇండియా కూటమి సీఎం అభ్యర్థి, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరెన్ వ్యూహాలు పనిచేస్తాయా..? ప్రజలు మళ్లీ ఇండియా కూటమికే ఓటేస్తారా..? లేదంటే మోడీ,షా వ్యూహాలు ఫలిస్తాయా..? అర్జున్ ముండా నాయకత్వం, శిబూసొరెన్ కోడలు సీతా సొరెన్ .. బీజేపీలో చేరిక, చంపై సొరెన్ రాకతో ఎన్డీఏ కూటమి పగ్గాలు చేపట్టనుందా...? అసలు జార్కండ్ లో రాజకీయం ఎలా సాగుతోంది?

జార్ఖండ్ ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పేలా లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో రెండు ప్రధాన కూటములు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జమ్ము కాశ్మీర్, హర్యానా ఫలితాల తరువాత బీజేపీ కొత్త జోష్ తో కనిపిస్తోంది. కానీ, ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న సానుకూలత ఇక్కడ బీజేపీకి కనిపించటం లేదు. జేఎంఎం నాయకత్వంలో ఇండియా కూటమి ఆచితూచి అడుగులు వేస్తోంది. రెండు కూటముల బలాలు, బలహీనతలు ఇప్పుడు గెలుపును డిసైడ్ చేయనున్నాయి. దీంతో, పోరు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

అవినీతి, బంగ్లాదేశీయుల చొరబాటు ప్రస్తావిస్తున్న బీజేపీ

ఎన్నికల సమరం జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా, ఎన్డీఏ కూటమి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతోంది. 2019 లో అధికారం కోల్పోయిన ఎన్డీఏ ఈ సారి తిరిగి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. అదే సమయంలో జేఎంఎం నాయకత్వంలోని ఇండియా కూటమి సైతం మరోసారి గెలుపు కోసం ఇప్పటికే పావులు కదుపుతోంది. ప్రధానంగా జార్ఖండ్ లో అవినీతిని ప్రధాన అస్త్రంగా మలచుకోవాలని బీజేపీ నిర్ణయించింది. దీంతో పాటుగా బంగ్లాదేశీల చొరబాటు అంశాన్ని తమ ప్రచారంలో కీలకంగా ప్రస్తావన చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించారు. పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ కు పది స్థానాలు వరకు కేటాయించనుంది. అదే విధంగా.. నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు రెండు సీట్లను బీజేపీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పొత్తులు కొంత మేర బీజేపీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో విఫలమైన లా అండ్ ఆర్డర్ అంశాన్ని బీజేపీ అనుకూలంగా మలచుకుంటోంది. చంపయీ సోరెన్ చేరికతో గిరిజనుల బలం ఉన్న ప్రాంతాల్లో బలం పెరగనుంది. శిబూ సోరెన్‌ కోడలు సీతా సోరెన్‌ పార్టీలోకి రావడం తో పాటుగా గిరిజన నేత అర్జున్‌ ముండా పార్టీకి నాయకత్వం బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. గెలుపు దక్కేదెవరికి అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి బీజేపీ కారణమనే అభిప్రాయం బలంగా ఉంది. మొత్తం 81 స్థానాలు ఉండగా..అందులో 28 ఎస్టీలకు రిజర్వు కావడంతో పాటుగా అక్కడ జేఎంఎం బలంగా ఉండటం కూడా బీజేపీకి నష్టం చేసేదిగా ఉంది.

ఓటర్లపై సంక్షేమ వల వేస్తున్న హేమంత్ సర్కార్..

అటు ఇండియా కూటమి ఇక్కడ కూడా సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హేమంత్ సొరెన్.. బీజేపీకి తమ సత్తా ఏంటో చూపించాలన్న కసితో కనిపిస్తున్నారు. కూటమితో లెక్కలు కుదుర్చుకున్న తర్వాత.. మరింతగా దూసుకుపోవాలన్నది హేమంత్ వ్యూహంగా కనిపిస్తోంది.ముఖ్యంగా సర్నా వర్గం మద్దతు తమకే దక్కుతుందని భావిస్తోంది. ఇండియా కూటమి నేతలు బీజేపీలో చేరటం ఎన్నికల సమయంలో డామేజ్ చేసే అంశంగా మారింది.

జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయి. నవంబర్ 13న తొలివిడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 13న ఫలితాలు వెలువడతాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే భాగస్వామి అయిన ఏజేఎస్‌యు జాతీయ ఉపాధ్యక్షుడు ఉమాకాంత్ రజాక్, హ్యాట్రిక్ బీజేపీ ఎమ్మెల్యే కేదార్ హజ్రాలు జేఎంఎంలో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. 2019లో మహువా నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన హజ్రా.. కాంగ్రెస్ అభ్యర్థి మంజు కుమారిపై 18,175 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మంజు కుమారి ఇటీవల కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరడం, ఆమెకు మహువా నుంచి టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో బీజేపీని హజ్రా వీడారు. జేఎంఎంలో చేరారు. తిరిగి మహువా నుంచి జేఎంఎం టిక్కెట్‌పై ఆయన బరిలోకి దిగనున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :