ASBL NSL Infratech
facebook whatsapp X

ఎన్నికల నుంచి తప్పుకొన్న జో బైడెన్ - కమల హారిస్ కి తన మద్దతు ప్రకటన

ఎన్నికల నుంచి తప్పుకొన్న జో బైడెన్ -  కమల హారిస్ కి తన మద్దతు  ప్రకటన

ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల లో   డెమొక్రాట్ పార్టీ తరుపున మరొక్క సారి పోటీ కి సిద్దమైన ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ ని ఎదుర్కొనే క్రమంలో వెనుక పడ్డ విషయం, వృద్యాప్యం వలన వచ్చిన కొన్ని సమస్యల కారణంగా గత కొద్ది రోజులుగా తమ పార్టీ నుంచి బైడెన్ ని ఎన్నికల నుంచి తప్పుకోవాలని అడుగుతున్న విషయం అందరికి తెలిసిందే! గత వారం రోజులుగా కోవిడ్ వల్ల విశ్రాంతి తీసుకుంటున్న జో బైడెన్ " తాను అధ్యక్ష ఎన్నికల  పోటీ నుంచి తప్పు కొంటున్నట్టు , తన మద్దతు వైస్ ప్రెసిడెంట్ కమలా హరిస్ " అని ప్రకటించారు. తానూ అధ్యక్ష పదవి ప్రయాణం లో మొదటి మరియు అత్యుత్తమ నిర్ణయం కమలా హారిస్ ని వైస్ ప్రెసిడెంట్ గా చేయడమే అని ఇప్పుడు  కూడా తన తరువాత అమెరికా ను పటిష్టం గా నడపగలిగే సమర్ధమైన వ్యక్తి కమలా హారిస్ అని ప్రకటించారు. 

జో బైడెన్ తన నిర్ణయం ప్రకటించిన వెంటనే కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ కాండిడేట్ గా సరి అయిన వ్యక్తి అని మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా, బిల్ క్లింటన్ సమర్దిచారు. గత శుక్రవారం అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన ఒక సర్వే లో పది మందిలో ఆరుగురు (6 out of 10) కమల హారిస్  సమర్ధవంతమైన అభ్యర్థి అని కూడా సమర్ధించింది. గత రెండు ఏళ్ల లో అనేక సార్లు జో బైడెన్ పరిపాలన లో కమలా హారిస్ మీద ఆధారపడ్డారని, ఈ నిర్ణయం సహజ ప్రక్రియేనని సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ షాప్టోన్ అభిప్రాయ పడ్డారు. ప్రోగ్రెసివ్ కాంగ్రెస్ విమెన్ పరిమళా జైపాల్ కూడా కమాలా హారీస్ ని సమర్డిస్తూ డెమొక్రాట్స్ అందరూ కలిసి కమలా హారిస్ ని గెలిపించాలి అని పిలుపునిచ్చారు. "తనను అభ్యర్థి గా అందరూ ఆమోదించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తామని, అందరి మద్దతు తో ముందుకు వెళ్తాను" అని కమల హారిస్ ప్రకటించారు.   

కమలా హారిస్ ముందున్న సవాళ్లు ఏమిటి? 

అమెరికా లో డెమాక్రాట్స్ పార్టీ రూల్స్ ప్రకారం జో బైడెన్ తన తరువాత కమల హారిస్ అని ప్రకటించగానే సరిపోదు. ఆ పార్టీ లో ఎక్కువశాతం మంది ఆమెను సమర్పించాల్సి ఉంటుంది. బైడెన్ నిర్ణయం రాక ముందు ఆగష్టు 1 నుంచి 7 వ తేదీ లోపల ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని ఆగస్ట్ 19 న చికాగో నగరం లో జరిగే కన్వెన్షన్ లో బైడెన్ ని అధ్యక్ష పోటీ లో అభ్యర్థి గా ప్రకటిస్తారు. ఇప్పుడు మారిన పరిస్థితులలో కమలా హరిస్ కూడా ఇదే విధం గా ఎన్నిక అవ్వాలి. బహుశా ఆగస్టు 1 నుంచి 7 వ తేదీ సమయం సరిపోదు అనుకొంటే ఇంకొక వారం వాయిదా వేసే  అవకాశం వుంది. దాదాపు 4700 మంది డెమొక్రాట్ కాండిడేట్ ల, అందులో ఇంకో వోట్ వెయ్యని 700 మంది సూపర్ కాండిడేట్ ల మద్దతు కూడగట్టు కోవాల్సి ఉంటుంది.  

అలాగే పార్టీ లో ఇంకో వ్యక్తి  కమలా హారిస్ ను ఛాలెంజ్ చెయ్యకుండా చూసుకోవాలి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ కూడా ప్రెసిడెంట్ బైడెన్ కి మద్దతు గా నిలిచి, అన్ని విధాలా సమర్ధుడు అనిపించుకున్నాడు. గావిన్ న్యూసోమ్ కూడా అధ్యక్ష పదవి పోటీ లో వున్నాడని అతని మద్దతు దారులు అంటూ ఉంటారు. కాబట్టి కమల హారిస్ ముందుగా న్యూసోమ్ మద్దతు సంపాదించాల్సి ఉంటుంది. 

ప్రతి అధ్యక్ష ఎన్నిక కు DNC (Democratic National Convention ) డెమొక్రాట్ పార్టీ తరుపున విరాళాలు సేకరిస్తుంది- ఖర్చు పెడుతుంది. 2024 అధ్యక్ష ఎన్నికలలకు ఇప్పటి వరకు $565 మిలియన్ డాలర్లు విరాళాలు గా స్వీకరించింది. అందులో $428 మిలియన్స్ దాకా ఖర్చు పెట్టింది కూడా. ఇప్పుడు కమలా హారిస్ ఆ ఫండ్ ని వినియోగించుకోవాలి. అవసరం అయినా మేర కొత్త విరాళాలు సేకరించాలి. 

ఈ సవాళ్లను అధికమించి డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి గా పోటీ లో దిగుతుందని, ట్రంప్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆశిద్దాం. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :