ASBL Koncept Ambience
facebook whatsapp X

జర్నలిస్టు విజయ్ బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్.. రూ.50 వేలు జరిమానా!

జర్నలిస్టు విజయ్ బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్.. రూ.50 వేలు జరిమానా!

జర్నలిస్ట్ విజయ్ బాబుపై రూ.50 వేలు జరిమానా విధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రాజకీయ దురుద్దేశంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారని మండిపడింది. వైసీపీ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పని చేసిన విజయ్ బాబు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారంటూ ఇటీవల హైకోర్టులో ఒక పిటిషన్‌పై వేశారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పిటిషన్ వేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని డిస్మిస్ చేయడంతోపాటు విజయ్ బాబుపై రూ.50 వేల జరిమానాను విధిస్తున్నట్లు పేర్కొంది. నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలో రూ.50 వేలు చెల్లించాలని ఆయన్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని దివ్యాంగుల సంరక్షణ కోసం వినియోగించాలని అధికారులను కోర్టు సూచించింది. ఈ పిటిషన్ ద్వారా ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని, అసలు తమ హక్కులు తెలియకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేని వారి కోసం వేయాల్సిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాను ఇష్టానుసారం వినియోగించుకుంటే న్యాయపరంగా అది నేరమేనని స్పష్టం చేసింది.

 


 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :