ASBL Koncept Ambience
facebook whatsapp X

కాగ్ చీఫ్ గా తెలుగువ్యక్తి సంజయ్ మూర్తి..

కాగ్ చీఫ్ గా తెలుగువ్యక్తి సంజయ్ మూర్తి..

కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నూతన చీఫ్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్‌ గిరీశ్ చంద్ర ముర్ము పదవీకాలం బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్‌ను ఎంపిక చేశారు. ఈ పదవి చేపడుతోన్న తొలి తెలుగు వ్యక్తి మూర్తి.

ఎవరీ సంజయ్ మూర్తి..?

అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడైన సంజయ్ మూర్తి.. 1964 డిసెంబరు 24న జన్మించారు. మెకానికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు. 1989 సివిల్స్‌లో హిమాాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ఆయన 2002-07 మధ్యకాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ, ఐటీ మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ (ఎన్‌ఐఎ్‌సజీ)లో మూడేళ్లు డైరెక్టర్‌గా కొనసాగారు. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రెటరీగా ఉన్నారు.

అక్టోబరు 1, 2021 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన విధానాలను పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలును నిర్ధారించడం, దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధిని ప్రోత్సహించేలా విద్యా సంస్థలకు సహకరించడం వంటి కీలక బాధ్యతలు తీసుకున్నారు. నవంబరు 21న సంజయ్ మూర్తి కాగ్‌ బాధ్యతలు చేపడతారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 క్లాస్(1)‌ ద్వారా దఖలుపడిన అధికారాన్ని వినియోగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఐఏఎస్ కె. సంజయ్ మూర్తిని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు..

ఆయన బాధ్యతలు చేపట్టే రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి’ అని కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఇక, జీసీ ముర్ము 2020 ఆగస్టు 8 కాగ్ చీఫ్‌గా నియమితులయ్యారు. ముర్ము పదవీకాలంలోనే ఎన్‌డిఎ ప్రభుత్వం చేపట్టిన హైవే ప్రోగ్రామ్, భారతమాల ప్రాజెక్ట్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఆడిట్‌తో సహా అనేక కీలకమైన ఆడిట్ నివేదికలు వచ్చాయి. కాగ్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ముర్ము.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూ కశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌‌గా పనిచేశారు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :