ASBL Koncept Ambience
facebook whatsapp X

క సినిమా మేక‌ర్స్ తెలివైన ప్లాన్

క సినిమా మేక‌ర్స్ తెలివైన ప్లాన్

కెరీర్లో స‌రైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran abbavaram) త‌న ఆశ‌ల‌న్నింటినీ త్వ‌ర‌లో రిలీజ్ కానున్న క(KA movie) సినిమా పైనే పెట్టుకున్నాడు. కిర‌ణ్ కు ఇదే ఫ‌స్ట్ పాన్ ఇండియ‌న్ ఫిల్మ్. స‌క్సెస్ ఎలిమెంట్స్ తో పీరియాడిక్ డ్రామాలో రూపొందుతున్న ఈ సినిమాలో కిర‌ణ్ పోస్ట్ మ్యాన్ పాత్ర‌లో క‌నిపించనున్న‌డు. ఓ గ్రామంలో జ‌రిగే అనూహ్య సంఘ‌ట‌న‌ల చుట్టూ ఎన్నో ట్విస్టులుంటాయ‌ని టీమ్ మెంబ‌ర్స్ అంటున్నారు.

ఇప్ప‌టివ‌కే రిలీజైన టీజ‌ర్, లిరిక‌ల్ సాంగ్ ఆడియ‌న్స్‌కి బాగా రీచ్ అయ్యాయి. ఇప్పుడంతా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాను అక్టోబ‌ర్ 31న థియేట‌ర్ల లోకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. కానీ ఆ టైమ్ లో పోటీ మాత్రం గ‌ట్టిగానే ఉంది. ఇప్ప‌టికే విశ్వ‌క్సేన్(Viswaksen) మెకానిక్ రాకీ(Mechanic Rockey) అదే రోజున రిలీజ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

కానీ ఇప్పుడా సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salman) ల‌క్కీ భాస్క‌ర్(Lucky Bhaskar) కూడా అదే రోజున రిలీజ్ కానుంది. స‌త్యదేవ్(Satyadev) జీబ్రా(Zeebra) పై మెల్లిగా హైప్ పెరుగుతుంది. శివ కార్తికేయ‌న్(Siva Karthikeyan) అమ‌ర‌న్(Amaran) కూడా ఈ పోటీలో ఉంది. వీటి మ‌ధ్య కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌స్తే త‌ప్ప‌క రిస్క్ అవుతుంది. కానీ మెకానిక్ రాకీ, ల‌క్కీ భాస్క‌ర్ పోటీ నుంచి త‌ప్పుకోవ‌చ్చనే ప్ర‌చారం ఉండ‌టంతో ముందు జాగ్ర‌త్త‌గా క సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నార‌ట మేక‌ర్స్. ఎందుకంటే ఈ డేట్ మిస్ అయితే త‌ర్వాత వ‌రుస‌గా పెద్ద సినిమాలున్నాయి కాబ‌ట్టి ఇదే బెస్ట్ డేట్ అనుకుంటున్నార‌ట క సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :