ఓటీటీ లోకి అప్పుడే రాను అంటున్న కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ…
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం ‘ క ‘. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను బాగా అలరించడంతో కలెక్షన్స్ భారీగానే వసూల్ అయ్యాయి. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న కిరణ్ చిన్న సినిమాలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ మూవీ గురించి కిరణ్ అబ్బవరం ఇచ్చిన హైప్, మూవీ టీజర్, ట్రైలర్ అన్ని పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంతో మూవీకి మంచి ఓపెనింగ్ దక్కింది.
విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రంపై విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటు సెలబ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని బాగా పొగడడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. విడుదలైన నాలుగు రోజులు గడవక ముందే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను దాటేసింది. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. పండగ హైట్ తగ్గినా ‘ క ‘ మూవీ క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. అయితే మొదట తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఆలస్యంగా మిగిలిన భాషల్లో రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. దీనితో పాటుగా సాటిలైట్ హక్కులు కూడా ఈటీవీకే దక్కాయి. థియేటర్లో విడుదలైన నాలుగు వారాల అనంతరం ఈ చిత్రం ఓటీటీ లోకి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ మూవీకి ఉన్న లాంగ్ థియరీటికల్ రన్ ఇలాగే కొనసాగితే.. స్ట్రీమింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు మిగిలిన భాషల్లో ఇప్పుడిప్పుడే విడుదలవుతున్న ఈ చిత్రం అప్పుడే ఓటీటీ లోకి వస్తే కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది.దీంతో ఈనెల 29న స్ట్రీమింగ్ అవ్వాల్సిన ఈ చిత్రం మరికొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ మూడవ వారం లేక క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.