ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : కొత్త పాయింట్ తో 'క' సస్పెన్స్ థ్రిల్లర్

రివ్యూ : కొత్త పాయింట్ తో 'క' సస్పెన్స్ థ్రిల్లర్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్
నటి నటులు : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు
సంగీతం : సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్ : శ్రీ వరప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సుధీర్ మాచర్ల
ఫైట్స్ : రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ : పొలాకి విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చవాన్
సహా నిర్మాతలు  : చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
సమర్పణ : శ్రీమతి చింతా వరలక్ష్మి
నిర్మాత  : చింతా గోపాలకృష్ణ రెడ్డి, రచన దర్శకత్వం :సుజీత్, సందీప్
విడుదల తేదీ : 31.10.2024
నిడివి :2 గంటల 31 నిముషాలు

రొటీన్ చిత్రాలతో వరసగా సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఈ సారి  'క'  (KA) అనే డిఫరెంట్ టైటిల్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్‌లతోనే అందరిలోనూ భారీ అంచనాలు క్రియేట్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్‌తోనే క మూవీ మీద అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సారైనా కిరణ్ అబ్బవరంకు సరైన హిట్టుని ఇచ్చిందా? లేదా? అన్నది చూద్దాం.

కథ:

అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ  అనాథ. తన వాళ్ళ కోసం చిన్నతనం నుంచి పరితపిస్తూ ఉంటాడు. తన వాళ్ళ పై తనకు ఉన్న ప్రేమ కారణంగానే అనాధ ఆశ్రమం నుంచి పారిపోతాడు.  అనాథ ఆశ్రమంలోని మాస్టర్ గురునాథం (బలగం జయరామ్) వద్దున్న డబ్బుని కాజేసి పారిపోతాడు. ఐతే, అభినయ్ వాసుదేవ్ కి చిన్న తనం నుంచే ఎదుటి వాళ్ల ఉత్తరాలు చదవడం బాగా ఇష్టం. ఎదుటి వాళ్ల ఉత్తరాలు చదువుతూ తన సొంత వాళ్లే రాసినట్టుగా ఫీల్ అవుతుంటాడు. అలాంటి వాసుదేవ్ కృష్ణగిరి ప్రాంతానికి వచ్చి పోస్ట్ మేన్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. రంగారావు (అచ్యుత్ కుమార్) వద్ద జాబులో జాయిన్ అవుతాడు. రంగారావు కూతురు సత్యభామ (నయని సారిక)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా వాసుదేవ్ ప్రేమలో పడుతుంది. అదే ఊర్లో రాధ (తన్వి రామ్) టీచర్‌గా పని చేస్తుంటుంది.ఇది ఇలావుండగా ఆ ఊర్లో అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఆ ఊర్లో అమ్మాయిల మిస్సింగ్ వెనకాల ఉన్నది ఏంటి? ఉత్తరాలు చదివే అలవాటు వల్ల వాసుదేవ్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? ఆ ఊర్లో లాలా, అబిద్ షేక్‌ల పాత్ర ఏంటి? అసలు ఈ కథను ముందుకు నడిపే ఆ ముసుగు వ్యక్తి ఎవరు? అన్నది మిగతా కథ కోసం థియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు :

కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా అని చెప్పొచ్చు. నటుడిగా ఎంతో మెరుగయ్యాడనిపిస్తుంది. ఈ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించే ప్రయత్నం చేశాడు. అప్పుడప్పుడు  నెగెటివ్ టచ్ కూడా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. డైలాగ్ డెలివరీలో ఇది వరకటి సినిమాలకంటే బెటర్ అయ్యాడనిపిస్తుంది. హీరోయిన్ నయన్ పాత్ర పాటలకే పరిమితం అన్నట్టుగా ఉంది. హీరోయిన్ పాత్రలో నయన్ సారిక బాగా నటించింది.  తన్వి రామ్‌ హోమ్లీ లుక్స్ లో కాస్త ఇంపార్టెంట్ రోల్ దక్కినట్టు, నటనకు స్కోప్ ఉన్న కారెక్టర్ లభించినట్టు అనిపిస్తుంది. బలగం జయరామ్, అచ్యుత్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య ప్రదీప్, అజయ్ వంటి పాత్రలు ఓకే అనిపిస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు :

టెక్నికల్‌గా ఈ చిత్రం బాగుంది. టీం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. దర్శకులు సందీప్, సుజిత్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి బాగానే ఆకట్టుకున్నారు. అయితే, స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను వారు చాలా బాగా చూపించారు. విజువల్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ కూడా మెప్పిస్తుంది. మరీ పూర్తిగా ఆ కాలానికి తీసుకెళ్లలేకపోయినా.. ఆ ఫీల్‌ను మాత్రం ఉంటుంది. శ్యామ్ సీఎస్ ఇచ్చిన ఆర్ఆర్ కూడా ప్రధాన బలంగా నిలుస్తుంది. కొన్ని పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. ఆర్ఆర్ మాత్రం సినిమాకు ప్రాణంగా నిలిచింది. మాటలు కొన్ని చోట్ల మనుసుని హత్తుకుంటాయి. నిర్మాత చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మంచి  క్వాలిటీ మూవీని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.

విశ్లేషణ :

క మూవీ  పాయింట్ పరంగా క చాలా కొత్తగా ఉంటుంది. అసలు ఇంత వరకు ఇలాంటి పాయింట్‌ను ఎవ్వరూ టచ్ చేయేలేదోమో అన్నట్టుగా ఉంది. ఈ పాయింట్‌లో అన్ని రకాల అంశాలుంటాయి. పూర్తి స్థాయి కమర్షియల్ యాంగిల్ కూడా ఉంది. కావాల్సినంత హీరోయిజం పెట్టారు. యాక్షన్, రొమాన్స్, పాటలు, కొన్ని చోట్ల కామెడీ ఇలా అన్నీ కలగలపి ఉంటాయి. అయితే ఇందులో పెద్ద సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ మాత్రం ఎక్కువగా ఉండవు. ఇంటర్వెల్‌కు ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ ఎంగేజింగ్‌గా ఉంటుందా? అని అనుకుంటారు. కానీ ప్రేక్షకుడి ఊహకు సాగేలానే కథ ఉంటుంది. ఈ మూవీ ప్రాణం అంతా కూడా చివరి 20 నిమిషాల్లోనే ఉంటుంది. అక్కడే దర్శకులుగా, రచయితలుగా సందీప్, సుజిత్‌లు తమ మార్క్, కొత్తదనాన్ని చూపించారు. అదొక్కటే ఈ మూవీని కాపాడుతుంది. కానీ చివర్లో ఇచ్చే ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :