విలేజ్ మిస్టరీతో సినిమా తీస్తే హిట్టే!
చిన్న పల్లెటూర్లో ఓ రహస్యంతో కూడిన క్రైమ్. దాన్ని సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగే హీరో. ఊహించని ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేసే ఎలిమెంట్స్ తో పాటూ షాకింగ్ క్లైమాక్స్ తో ఎండ్ కార్డ్ వేయడం గత కొన్నేళ్లుగా ఇదొక సక్సెస్ ఫార్ములగా మారిపోయింది. ఈ విషయాన్ని దర్శక రచయితలు గుర్తించారు కాబట్టే ఈ స్పెషర్ జానర్ హిట్ అవుతుంది.
హిట్ చాలా కీలకమైన టైమ్ లో ఈ జానర్ లో విరూపాక్ష(Virupaksha) అనే సినిమా చేసి సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) మంచి హిట్ అందుకున్నాడు. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో వచ్చి సక్సెస్ అవడంతో సెకండ్ పార్ట్ ను థియేటర్లో రిలీజ్ చేసి ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా సూపర్ హిట్ అందుకున్న సినిమా మా ఊరి పొలిమేర2(Maa Oori Polimera2). ఓ కుగ్రామంలో దాచబడిన నిధి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
మహా సముద్రం(Maha Samudram)తో డిజాస్టర్ అందుకున్న అజయ్ భూపతి(Ajay Bhupathi)కి మంగళవారం(Mangalavaram)తో కంబ్యాక్ అయింది కూడా ఈ జానర్ తోనే. మసూద(Masooda) కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమానే. సందీప్ కిషన్(Sundeep Kishna) ఊరిపేరు భైరవకోన(oori Peru Bhairavakona) సినిమా ఏకంగా టైటిల్ తోనే జానర్ చెప్పేసింది. ఈ సినిమా కూడా హిట్టే. ఇక తాజాగా రిలీజైన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(KA) కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తోంది. ఇదంతా చూస్తుంటే పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ లో రాసుకునే మిస్టరీ కథలు హిట్ సెంటిమెంట్ గా మారుతున్నట్లు అనిపిస్తోంది.