ASBL NSL Infratech

ఇండియ‌న్2 పై క‌మ‌ల్ షాకింగ్ కామెంట్స్

ఇండియ‌న్2 పై క‌మ‌ల్ షాకింగ్ కామెంట్స్

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్, త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపొందిన ఇండియ‌న్2 మ‌రో తొమ్మిది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా సినిమాకు కావాల్సినంత బ‌జ్ మాత్రం రాలేదు. కానీ బ‌య్య‌ర్లు మాత్రం రిలీజ్ రోజుకు ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు పోటెత్తుతార‌ని జోస్యం చెప్తున్నారు.

ఇదిలా ఉంటే ఇండియ‌న్2 ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క‌మ‌ల్ హాస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సీక్వెల్ కంటే ఇండియ‌న్ మూడో భాగాన్ని క‌మ‌ల్ ఎక్కువ‌గా ఎలివేట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. తాను సెకండ్ పార్ట్ కు ఫ్యాన్ ను కాద‌ని, మూడో భాగానికి ఫ్యాన‌ని చెప్ప‌డం షాక్ క‌లిగిస్తోంది. అంటే ఇన్‌డైరెక్ట్ గా ఇండియ‌న్2లో కంటే అస‌లైన క‌థ మొత్తం ఇండియ‌న్3లోనే ఉంద‌నే క‌దా అర్థ‌మ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అస‌లే సినిమాకు బ‌జ్ త‌క్కువ‌గా ఉంది. ఇలాంటి టైమ్ లో ఈ ర‌క‌మైన స్టేట్‌మెంట్లు సినిమాపై అంచ‌నాల‌ను త‌గ్గిస్తాయి. రెండో వారంలో కూడా టాలీవుడ్ లో క‌ల్కి హ‌వానే కొన‌సాగుతుంది. ఇండియ‌న్2 రిలీజ్ నాటికి అదేమైనా తగ్గుతుందా అంటే చెప్ప‌లేం. ఆ రోజు నుంచే సాధార‌ణ టికెట్ రేట్స్ కు క‌ల్కి టికెట్స్ అందుబాటులోకి వ‌స్తాయి కాబ‌ట్టి ఆక్యుపెన్సీలు పెరిగే ఛాన్స్ లేక‌పోలేదు. ఇలాంటి టైమ్ లో క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న ఫ్యాన్స్ కు సైతం అయోమ‌యంగా మారాయి. కానీ శంక‌ర్ మాత్రం ఇండియ‌న్2లో క‌మ‌ల్ విశ్వ‌రూపాన్ని చూస్తార‌ని ఫ్యాన్స్ కు హామీ ఇస్తున్నాడు.  

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :