ASBL Koncept Ambience
facebook whatsapp X

పోటీ ఉంటే కంగువ‌కు క‌ష్ట‌మే!

పోటీ ఉంటే కంగువ‌కు క‌ష్ట‌మే!

ద‌స‌రాకు మంచి రిలీజ్ డేట్ దొరికింద‌ని ఆనంద ప‌డేలోపే అదే డేట్ లో ర‌జినీకాంత్ వేట్ట‌యాన్ ను రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేయ‌డంతో త‌మ సినిమాను వాయిదా వేసుకున్నారు కంగువ బృందం. కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. న‌వంబర్ అనుకుంటున్నారు కానీ ఇంత భారీ బ‌డ్జెట్ సినిమాకు అది క‌రెక్ట్ సీజ‌న్ కాద‌ని ఆలోచిస్తున్నార‌ట‌.

పుష్ప‌2 ఒక‌వేళ అనుకున్న టైమ్ కు రాక‌పోతే ఆ డేట్ లో వ‌ద్దామ‌నుకుంటున్నార‌ట‌. కానీ బ‌న్నీ, సుకుమార్ ఈసారి ఆ ఛాన్స్ ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు. అయితే కంగువ ఇంత ఆలోచించ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఈ సినిమాపై భారీ పెట్టుబ‌డులు పెట్టారు. తెలుగు హ‌క్కుల నుంచి రూ.45 కోట్లు ఆశిస్తున్నారు. హిందీ డ‌బ్బింగ్ ఏకంగా రూ.100 కోట్లు చెప్తున్నారు.

త‌మిళ వెర్ష‌న్ కు మాత్ర‌మే రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకున్నార‌ట‌. ఓవ‌ర్సీస్ టార్గెట్ రూ.50 కోట్లుంద‌ట‌. వీటితో పాటూ డిజిట‌ల్, ఆడియో రైట్స్ కు వేరే లెక్కుంది. ఇవ‌న్నీ వెనక్కి రావాలంటే క‌నీసం రూ.350 కోట్ల‌కు పైగా షేర్ రావాలి. అది జ‌రగాలంటే కంగువకు పోటీ లేకుండా సోలోగా రావాల్సిన అవ‌స‌ర‌మెంతైనా ఉంది. డిసెంబ‌ర్, జ‌న‌వరిలో ఛాన్స్ లో లేదు కాబ‌ట్టి న‌వంబ‌ర్ 15ను ఒక ఆప్ష‌న్ గా పెట్టుకున్నార‌ట‌. మ‌రి ఆఖ‌రికి కంగువ టీమ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :