కంగువ ప్లాన్ మారిందా?
సూర్య(Suriya) హీరోగా శిరుత్తై శివ(Siruthai Siva) దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ(Kanguva) సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సీఫీస్ వద్ద తీవ్ర పరాజయం పొందింది. దసరాకు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి నవంబర్ 14న రిలీజైంది. 1000 ఏళ్ల నాటి కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన కంగువ ఆడియన్స్ ను ఏ మాత్రం మెప్పించలేక పోయింది.
కంగువలో ఏ ఎమోషన్ కు ఆడియన్స్ సరిగా కనెక్ట్ కాకపోవడం వల్లే సినిమా ఇంతలా ఫ్లాపైంది. కంగువ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ముగిసినట్టే. దీంతో కంగువ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ప్రైమ్ వీడియో(Prime Video) ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ముందు డీల్ ప్రకారం కంగువ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే డిజిటల్ లో రిలీజ్ చేయాలి.
కానీ థియేట్రికల్ రన్ అంత సంతృప్తికరంగా లేకపోవడంతో కంగువను అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఎప్పుడనేది తెలియదు కానీ త్వరలోనే కంగువను ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. థియేటర్ లో ఆడియన్స్ ను మెప్పించలేకపోయినా కంగువ ఓటీటీలో అయినా మెప్పిస్తుందేమో చూడాలి.