సొంత రాష్ట్రంలో కంగువకు స్క్రీన్ల కొరత?
కంగువ(Kanguva) సినిమాపై సూర్య(Suriya) ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్లోనే ఎంతో ఎక్కువ టైమ్ షూటింగ్ చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో కంగువతో తన మార్కెట్ ను బాగా విస్తరించుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం రెస్ట్ తీసుకోకుండా అన్ని నగరాలు తిరిగి కంగువను ప్రమోట్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే ఎక్కువ స్క్రీన్లలో కంగువ రిలీజ్ కావాలి. కానీ కంగువకు అమరన్(amaran) మూవీ రూపంలో ఓ సమస్య వెంటాడుతుంది. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఇరువైపులా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కడం లేదని తెలుస్తోంది. తమిళనాడులోని డీల్ ప్రకారం ఏ సినిమాకైనా మూడో వారం నుంచే డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ షేర్ వెళ్తుంది.
అమరన్ ఇప్పుడు స్ట్రాంగ్ గా రన్ అవుతున్న టైమ్ లో ఎక్కువ స్క్రీన్లు అమరన్ కు కేటాయిస్తే లాభ పడొచ్చని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. కానీ కంగువకు స్క్రీన్ కౌంట్ తగ్గితే మాత్రం ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ గా ఓపెనింగ్స్ పై పడుతుంది. చూస్తుంటే తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే కంగువకు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చేలా అనిపిస్తోంది. సిరుత్తై శివ(Siruthai Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ కు విజువల్ వండర్ లా అనిపిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా చెప్తుంది.