ASBL NSL Infratech

క‌న్న‌ప్ప జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే అంతే సంగ‌తులు

క‌న్న‌ప్ప జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే అంతే సంగ‌తులు

పెద్ద సినిమా అంటే భారీ బ‌డ్జెట్, స్టార్ క్యాస్టింగ్ కాదు, మంచి క‌థ‌. ఆ కథే బాగుంటే మిగిలిన‌వ‌న్నీ బోన‌స్‌లుగా యాడ్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా రిలీజైన కల్కి సినిమా విష‌యంలో ఇదే జ‌రిగింది. కేవ‌లం ప్ర‌భాస్ ఒక్క‌డే ఆ సినిమాలో హీరో అనిపించ‌డు. ప్ర‌భాస్ తో పాటూ అమితాబ్, దీపికా, క‌మ‌ల్ ఇలా అంద‌రూ త‌మ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు కాబ‌ట్టే క‌ల్కి ఇవాళ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ క‌ల్కి కోసం ఎంత గ్రౌండ్ వ‌ర్క్ చేశాడ‌నేది తెర మీద చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాను ఏం చెప్పాల‌నుకున్నాడో దాన్ని అన్ని ర‌కాలుగా గొప్ప‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. దీంతో క‌ల్కి త‌ర్వాత వ‌చ్చే పాన్ ఇండియా సినిమాల మీద ఈ ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని సినీ విశ్లేష‌కులంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా సినిమా తీస్తే క‌ల్కిలానే తీయాల‌ని, లేద‌నంటే వాటి జోలికి వెళ్ల‌కూడ‌ద‌నేలా నాగ్ అశ్విన్ క‌ల్కి తో ప్రూవ్ చేశాడు.

దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి త్వ‌ర‌లో రానున్న మంచు విష్ణు క‌న్న‌ప్ప మీద ప‌డింది. ఈ సినిమాలో విష్ణుతో పాటూ ప్ర‌భాస్, అక్ష‌య్ కుమార్, మోహ‌న్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి భారీ క్యాస్టింగే ఉంది. ఇంత మంచి స్టార్ క్యాస్ట్ ను పెట్టుకుని కూడా విష్ణు, క‌న్న‌ప్ప సినిమా టీజ‌ర్ తో ట్రోల్ అయ్యాడు. క‌ల్కి సినిమా చూశాకైనా విష్ణు క‌ళ్లు తెరిచి క‌న్న‌ప్ప విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచిది. లేదంటే లేనిపోని ట్రోలింగ్ కు సిద్ద‌మ‌వ్వాల్సి ఉంటుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :