ASBL Koncept Ambience
facebook whatsapp X

ఘనంగా జరిగిన కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

ఘనంగా జరిగిన కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు

భారత్ కల్చరల్ అకాడమీ తెలుగు టెలివిజన్ రచయిత సంఘం ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్  సారధ్యంలో కళాప్రపూర్ణ కాంతరావు 101వ  జయంతి వేడుకలు ఈ రోజు ఫిలిం ఛాంబర్ హాల్లో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశ్రాంత ప్రభుత్వ సలహాదారుడు ఐ ఆ స్ అధికారి రమణా చర్య మాట్లాడుతూ - "ఎన్టీర్ ఎన్నార్ లతో పాటు సినిమా రంగంలో రాణించిన కాంతరావుకు ప్రభుత్వం నుండి రావలసిన గుర్తింపు రాలేదు. పురస్కారాల విషయంలో ఎన్టీర్ ఎన్నార్ లకు కూడా ఆలస్యంగా గుర్తింపు లభించింది. కాంతరావు కు ఇప్పటికైనా ప్రభుత్వం తరపున తగిన గుర్తింపు దక్కేలా కృషి చేస్తే బాగుంటుంది. నేను ప్రభుత్వం లో వున్నంతకాలం కాంతరావు తో ఏర్పడిన పరిచయం చివరివరకు కొనసాగింది." అన్నారు.

భక్త ప్రహ్లద బాలనటి, అలనాటి అందాల తార రోజా రమణి మాట్లాడుతూ - "కాంతరావు తో తానూ చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా.. హీరోయిన్ గా కూడా నటించడం జరిగింది. అదో గొప్ప మర్చిపోలేని అనుబంధం", అంటూ కాంత రావు కుటుంబంతో వున్నా అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ నటి కవిత మాట్లాడుతూ - "నేను కాంతరావు దత్తపుత్రికను, ఎందుకంటె ఆయన నన్ను సొంత కూతురులా చూసుకునేవారు. సినిమా రంగానికి చెందిన సంఘాలు  చొరవ తీసుకుని చేయాలిసిన కార్యక్రమాన్ని తెలుగు టెలివిజన్ రచయితల సంఘం చేయడం అభినందనీయం. కాంతారావు కు తగిన గుర్తింపు ప్రభుత్వం నుండి లభించేలా ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చర్యలు తీసుకోమని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దలతో చర్చిస్తాను " అన్నారు.

రచయిత్రి డా.కె .వి .కృష్ణ కుమారి మాట్లాడుతూ - జానపథ వీరుడిగా ఒక వెలుగు వెలిగిన కథానాయకుడు కాంతారావు తెలుగు సినిమా వున్నంతకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచి వుంటారు. మా ఇద్దరికి వృత్తి రీత్యా వేరు వేరు రంగాలైన కాంతారావు కుటుంభం తో మంచి అనుభందం వుంది.

ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ - "తెలుగు సినిమా రంగం కాంతారావు ని పూర్తిగా విష్మరించింది. ఆయనకు సముచిత గౌరవం కలిగేలా సినిమా పెద్దలతో మాట్లాడతాను."అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో కాంతరావు కుమార్తె సుశీల, కుమారుడు రాజా, రచయితల సంఘం అధ్యక్షుడు ప్రేమ్  రాజ్, కోశాధికారి చిత్తరంజన్,ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ డి యస్ ప్రకాష్, అక్కినేని శ్రీధర్, కె వి యల్ నరసింహ  రావు,  ప్రేమ్ కమల్, స్వప్న పాల్గొన్నారు.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :