ASBL Koncept Ambience
facebook whatsapp X

కార్తీ ప్రేమ‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా!

కార్తీ ప్రేమ‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా!

భాష‌తో సంబంధం లేకుండా ఎవ‌రి సినిమాలనైనా ఆద‌రిస్తార‌నే మంచి పేరు తెలుగు ప్రేక్ష‌కులకు ఉంది. తమిళ హీరోల మీద తెలుగు ఆడియ‌న్స్ చూపించే అభిమానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్(Rajinikanth), క‌మ‌ల్‌హాస‌న్(Kamal Hassan) నుంచి మొద‌లుపెట్టి సూర్య‌(Suriya), విజ‌య్(Vijay), ధ‌నుష్(Dhanush), కార్తి(Karthi) లాంటి ఎంతోమంది స్టార్ హీరోల‌ను తెలుగు ఆడియ‌న్స్ నెత్తిన పెట్టుకుని వారి సినిమాల‌ను ఆద‌రిస్తున్నారు.

అయితే సూర్య(Surya) త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ, ఎప్పుడూ త‌న అన్న ఛాయ‌ల్లో ఉండ‌కుండా డిఫ‌రెంట్ గా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డానికే పాటు పడ్డాడు. ఆవారా(Aawara) సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కార్తీ యుగానికి ఒక్క‌డు(Yuganiki Okkadu) ద్వారా బాగా పాపుల‌ర‌య్యాడు.

అయితే పాపులారిటీ వ‌చ్చిందిలే అని కార్తీ ఎప్పుడూ తెలుగు ఆడియ‌న్స్ ను ప‌ట్టించుకోకుండా లేడు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోయింగ్ ను మ‌రింత పెంచుకుంటూ తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో కార్తీ స్పెష‌ల్ ప్లేస్ ద‌క్కించుకుంటున్నాడు. ఈ త‌రం త‌మిళ హీరోల్లో కార్తీలా తెలుగు ఎంతో చ‌క్క‌గా మాట్లాడే న‌టులు మ‌రెవ‌రూ లేరు. కార్తీ అన్న సూర్య కూడా ఈ విష‌యంలో వెనుక‌బ‌డే ఉన్నాడు. కార్తీ రీసెంట్ ఫిల్మ్ స‌త్యం సుంద‌రం(Satyam Sundaram)లో కార్తీ ఓ డిఫ‌రెంట్ డిక్ష‌న్‌తో డైలాగులు చెప్పాడు. సినిమా చూసిన వాళ్లంతా కార్తీ తెలుగు డ‌బ్బింగ్‌పై పెట్టిన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను అభినందిస్తున్నారు. భాష మీదే కాదు త‌న సినిమాల‌ను కూడా కార్తీ తెలుగులో ప్ర‌మోట్ చేయ‌డం ఆయ‌నకు తెలుగు అభిమానుల మీద ఉన్న మ‌క్కువ‌ను చాటి చెప్తోంది.  

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :