భారత సంతతి వ్యక్తికి ఆ కీలక పదవి
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్‌గా కశ్యప్ పటేల్‌కు అవకాశం దక్కనున్నది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ సంతతికి వ్యక్తికి ఆ కీలక పదవిని అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ కోసం ఏపని అయినా చేసేందుకు కశ్యప్ సిద్ధంగా ఉన్నారు. అయితే కశ్యప్ పటేల్‌కు గుజరాతీ మూలాలు ఉన్నాయి. ఈస్ట్ ఆఫ్రికాలో ఆయన పేరెంట్స్ పెరిగారు. 1970 దకశంలో ఆయన తండ్రి ఉగాండా నుంచి వలస వచ్చారు.
1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో ఆయన జన్మించారు. హిందువుగా ఆయన పెరిగారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. రిచ్‌మండ్ యూనివర్సిటీలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యూయార్క్‌లో లా డిగ్రీ చదివారు. యూకేలోని యూనివర్సిటీ కాలేజీ లండన్ ఫాకల్టీ ఆఫ్ లాస్ నుంచి ఇంటర్నేషనల్ లా సర్టిఫికేట్ పొందారు. రక్షణశాఖ మాజీ కార్యదర్శి క్రిస్టోఫర్ మిల్లర్ వద్ద పనిచేశారు. నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్‌లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా చేశారు.