ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసొచ్చింది ... వచ్చే ఎన్నికల్లో విజయం మనదే
ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే అని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుందని మండిపడ్డారు. ప్రజలు బాధ్యత ఇస్తే అంతే బరువుతో సేవ చేయాలన్నారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Tags :