ASBL Koncept Ambience
facebook whatsapp X

KCTCA Bathukamma Celebrations on Oct 5

KCTCA Bathukamma Celebrations on Oct 5

కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ సంబరాలకి మీకిదే మా ఆహ్వానం! ఈ సారి కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ పండుగ సంబరాలకి చాలా ప్రత్యేకతలు వున్నాయి !!! 

మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.

మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ 
అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది. ఆరోజు సమర్పించే నైవేద్యం ఏంటో తెలుసుకుందాం. పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ. దేశమంతా నవరాత్రుల సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒక రోజు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అమావాస్య రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు.
 
ఎంగిలి పూల బతుకమ్మ కథ
బతుకమ్మ చేసుకునేందుకు ముందు రోజు నుంచే ఆడవాళ్ళు పొలాలు, చెట్లు, గట్టులు తిరుగుతూ ఉంటారు. కనిపించిన అందమైన రంగు రంగుల పూలన్నీ కోసి తెచ్చి పెట్టుకుంటారు. మొదటి రోజు చేసుకునే ఎంగిలి పూల బతుకమ్మ పేర్చుకునేందుకు సిబ్బిలు, తంగేడు పూలు, గునుగు, తామర, చామంతి, బంతి, సీత జడలు పూలు ఎక్కువగా వినియోగిస్తారు. ముందుగా తంగేడు పూలలు పెట్టుకుని ఆ తర్వాత రంగులను బట్టి పూలను అమర్చుకుంటారు. ఎంగిలి పూల బతుకమ్మ కోసం ముందు రోజుగానే పూలు తెచ్చి నీళ్ళలో వేసుకుని ఉంచుతారు. అలా పూలు నిద్ర చేస్తాయి. అందుకే ఎంగిలి పూలు అంటారు. అది మాత్రమే కాదు పూలకు ఉన్న ఆకులు, కాడలు తెంచడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేస్తారు. అంటే ఎంగిలి చేసినట్టు అర్థం వస్తుంది.

మీఅందరకి ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!!

మీకు, మీ కుటుంబానికి మరియు మీ బంధుమిత్రులకు ఇదే మా ఆహ్వానం! You’re all Invited to the 18th Annual Bathukamma Festival Celebration!!
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :