పెళ్లి గురించి ఓపెన్ అయిన కీర్తి
కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండటం, వాటిని ఆమె ఖండించడం అందరికీ మామూలైపోయింది. మళ్లీ కొన్నాళ్ల కిందట కీర్తి పెళ్లి గురించి ప్రచారం జరిగితే ఇది కూడా రూమరే అని అందరూ లైట్ తీసుకుంటున్న టైమ్ లో అది రూమర్ కాదని, కీర్తి నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని స్వయంగా ఆమె తండ్రి సురేష్(Suresh) క్లారిటీ ఇచ్చాడు.
కీర్తి కూడా ఇప్పుడు ఈ విషయంలో ఓపెన్ అయిపోయింది. తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమది పదిహేనేళ్ల బంధమని తెలిపింది. అంతేకాదు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన కీర్తి దర్శన అనంతరం మీడియాతో మాట్లాడి తాను దర్శనానికి రావడానికి గల కారణాన్ని తెలిపింది.
తన మొదటి బాలీవుడ్ సినిమా బేబీ జాన్(Baby john) త్వరలో రిలీజ్ కాబోతుందని, దాంతో పాటూ వచ్చే నెలలో తన పెళ్లి కూడా ఉన్న నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి వచ్చినట్లు కీర్తి సిగ్గు పడుతూ వెల్లడించింది. పెళ్లి ఎక్కడని అడిగితే గోవాలో జరుగుతుందని కూడా చెప్పి, నెట్టింట తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసింది. కీర్తి సురేష్ కెరీర్ మంచి ఊపులో ఉన్న టైమ్ లో కీర్తి తన ప్రేమికుడ్ని పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.