రూ.11 లక్షలు పలికిన ... 0001
ఫాన్నీ నంబర్ల వేలం తెలంగాణ రవాణాశాఖకు కాసులు కురిపించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్) లో నిర్వమించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఒకే రోజు రూ.52,52,283 ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు కొనసాగిన టీజీ 09సీ సీరిస్ ముగిసి, 09డీ సీరిస్ ప్రారంభమైంది. ఈ క్రమంలో వేలంలో రూ.లక్షపైన పలికిన నంబర్ల వివరాలు జేటీసీ రమేశ్ వెల్లడిరచారు. టీజీ 09 డీ0001 నంబరును రూ.11,11,111లకు రుద్రరాజు రాజీవ్‌కుమార్ దక్కించుకున్నారు. ఇదే సీరిస్‌లో 0009 నంబరు రూ.10.40 లక్షలకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, 0006ను రూ.3.65 లక్షలకు పోరస్ ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్, 0005ను రూ.3.45 లక్షలకు వెగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, 0007ను రూ.2,06,569లకు నస్పిర మేనేజ్మెంట్ సర్వీసెస్, 0019ను రూ.1,95,009లకు నంబర్‌మాల్ ప్రైవేటు లిమిటెడ్, 0099ను రూ.1.85 లక్షలకు సీఎస్కే రిలేషన్స్, 0077ను రూ.1,17,789లకు మీనాక్షి ప్రాపర్టీ మేనేజ్మెంట్, ముగిసిన టీజీ 09సి సీరిస్‌లో 9999 నంబరును రూ.7,19,999లకు శ్రీయాన్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకున్నట్లు తెలిపారు.