ASBL Koncept Ambience
facebook whatsapp X

కిలారి రోశయ్యకు లైన్ క్లియర్.. రేపే జనసేనలో చేరిక..!

కిలారి రోశయ్యకు లైన్ క్లియర్.. రేపే జనసేనలో చేరిక..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఓడిపోయిన తర్వాత పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు ఆ పార్టీకి రాజీనామా (Resign) చేశారు. మరికొందరు కూడా త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఓడిపోయిన వెంటనే రాజీనామా చేసిన నేతల్లో కిలారి రోశయ్య (Kilari Rosaiah) మొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పినా ఏ పార్టీలో చేరతారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడాయనకు జనసేన (Janasena) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రేపు ఆయన జనసేనలో చేరబోతున్నారు.

కిలారి రోశయ్య పూర్తి పేరు కిలారి వెంకట రోశయ్య (Kilari Venkata Rosaiah). ఈయన తండ్రి కిలారి కోటేశ్వర రావు (Kilari Koteswara Rao) గుంటూరు జిల్లాలో (Guntur) సీనియర్ రాజకీయ నాయకుడు. గుంటూరు మిర్చియార్డ్ (Mirch Yard) ఛైర్మన్ గా పనిచేశారు. ఆయన వారసత్వంగా రోశయ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో (Prajarajyam) చేరి తెనాలి (Tenali) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ తరపున పొన్నూరు (Ponnuru) నుంచి పోటీ చేసి గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు (Ummareddy Venkateswarlu) ఈయన అల్లుడు.

గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కిలారి రోశయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అయిష్టంగానే బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేసేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే జనసేనలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపించారు కానీ ఇన్నాళ్లూ ఆ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే ఇప్పుడు కిలారి రోశయ్య చేరికకు రంగం సిద్ధమైంది.

మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో కిలారి రోశయ్య పార్టీలో చేరబోతున్నారు. ఈయనతో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను (Samineni Udayabhanu) కూడా పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. గుంటూరుకు చెందిన నలుగురు కార్పొరేటర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొంతమంది నేతలు వైసీపీ నుంచి జనసేనలో చేరబోతున్నారని ఆ పార్ట వర్గాలు చెప్తున్నాయి. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :